ఎయిర్‌టెల్‌ వన్‌వెబ్‌ శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ సేవలకు అనుమతులు మంజూరు

by Disha Web Desk 17 |
ఎయిర్‌టెల్‌ వన్‌వెబ్‌ శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ సేవలకు అనుమతులు మంజూరు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా శాటిలైట్ ఆధారిత బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందించేందుకు ఎయిర్‌టెల్‌కు చెందిన వన్‌వెబ్ ఇండియాకు ముఖ్యమైన అనుమతులు లభించినట్లు కంపెనీ పేర్కొంది. స్పేస్ రెగ్యులేషన్ కోసం ప్రభుత్వ సంస్థ అయిన IN-SPAce నుండి కార్యకలాపాలను ప్రారంభించేందుకు అనుమతి పొందింది. వన్‌వెబ్ ఇండియా బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందించడానికి టెలికాం విభాగం నుండి అవసరమైన లైసెన్స్‌లను ఇప్పటికే కలిగి ఉంది. అయితే, ప్రభుత్వం స్పెక్ట్రమ్‌ను కేటాయించిన తర్వాత సేవలు ప్రారంభిస్తామని భారతీ గ్రూప్ చైర్మన్ సునీల్ భారతీ మిట్టల్ అన్నారు. 618 శాటిలైట్ల ద్వారా ఇంటర్నెట్ సేవలను అందిస్తారు. మరోవైపు ఈ విధమైన సేవలు అందించడానికి జియో, అమెజాన్, ఎలాన్ మస్క్ స్టార్‌లింక్ పోటీపడుతున్నాయి.



Next Story

Most Viewed