పేటీఎమ్‌లోకి వచ్చిన విదేశీ పెట్టుబడులపై ప్రభుత్వం సమీక్ష

by Dishanational1 |
పేటీఎమ్‌లోకి వచ్చిన విదేశీ పెట్టుబడులపై ప్రభుత్వం సమీక్ష
X

దిశ, బిజినెస్ బ్యూరో: వన్97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్‌కు చెందిన చెల్లింపుల సంస్థ పేటీఎం పేమెంట్స్ సర్వీసెస్(పీపీఎస్ఎల్)లో చైనా నుంచి వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల గురించి ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ మేరకు ఇంటర్ మినిస్ట్రీరియల్ కమిటీ వర్గాలు తెలిపాయి. 2020, నవంబర్‌లో పీపీఎస్ఎల్ పేమెంట్ అగ్రిగేటర్లు, చెల్లింపుల గేట్‌వేల కోసం నియంత్రణ మార్గదర్శకాల ప్రకారం చెల్లింపుల అగ్రిగేటర్‌గా పనిచేసేందుకు భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) నుంచి లైసెన్స్ కోసం దరఖాస్తు చేసింది. అయితే, 2022 నవంబర్‌లో ఆర్‌బీఐ ఆ దరఖాస్తును తిరస్కరించింది. ఎఫ్‌డీఐ నిబంధనలకు అనుగుణంగా ఉండేలా సవరించి మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని కంపెనీని ఆదేశించింది. చైనాకు చెందిన యాంట్ గ్రూప్ వన్97 కమ్యూనికేషన్స్‌లో పెట్టుబడులు కలిగి ఉంది. ఈ నేపథ్యంలో తాజా పరిణామాల మధ్య పీపీఎస్ఎల్‌లో చైనా పెట్టుబడులను ఇంటర్ మినిస్టీరియల్ కమిటీ పరిశీలిస్తోందని, సరైన, సమగ్ర పరిశీలన తర్వాత ఎఫ్‌డీఐ అంశంపై నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది.


Next Story