మహిళలకు గుడ్ న్యూస్.. నేడు భారీగా తగ్గిన బంగారం ధర

by Disha Web Desk 8 |
మహిళలకు గుడ్ న్యూస్.. నేడు భారీగా తగ్గిన బంగారం ధర
X

దిశ, ఫీచర్స్ : మగువలు ఎక్కువగా ఇష్టపడేది బంగారం. ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా, లేదా ఏదైనా శుభకార్యానికి వెళ్లాలన్నా, మహిళలు ఒంటినిండా నగలు వేసుకోవడానికి ఎక్కువ ఆసక్తిచూపుతారు. అంతే కాకుండా మనం ఏదైనా శుభకార్యం చేయాలంటే కూడా మొదటగా బంగారమే కొనుగోలు చేస్తాం. ఇక బంగారం ధరల్లో రోజు రోజుకు హెచ్చు తగ్గులు అనేవి జరుగుతుంటాయి. ముఖ్యంగా ఈ మధ్య బంగారం ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. రోజు రోజుకు ధర పెరుగుతున్నాయి. కాగా నేడు (శనివారం) బంగారం ధరలు భారీగా తగ్గాయి. నిన్న మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.63000 ఉండగా, నేడు 250 తగ్గడంతో, గోల్డ్ రేట్ రూ.62,750గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర నిన్న రూ.68,730 ఉండగా, నేడు 280 తగ్గడంతో గోల్డ్ రేట్ రూ.68,450గా ఉంది.

హైదరాబాద్

22 క్యారెట్ల బంగారం ధర రూ.62,750

24 క్యారెట్ల బంగారం ధర రూ.68,450

విజయవాడ

22 క్యారెట్ల బంగారం ధర రూ.62,750

24 క్యారెట్ల బంగారం ధర రూ.68,450


Next Story