మళ్లీ పెరుగుతున్న బంగారంపై పెట్టుబడులు!

by Disha Web Desk 17 |
మళ్లీ పెరుగుతున్న బంగారంపై పెట్టుబడులు!
X

న్యూఢిల్లీ: మరోసారి బంగారం ధరలు పెరుగుతున్నాయి. గత కొంతకాలంగా స్టాక్ మార్కెట్లలో తీవ్ర ఒడిదుడుకులు ఎదురవుతున్న నేపథ్యంలో పెట్టుబడిదారులు బంగారం వైపునకు మళ్లుతున్నారు. ఇటీవల కొంత వెనక్కి తగ్గిన పసిడి దేశీయ, అంతర్జాతీయ పరిణామాల కారణంగా మళ్లీ పుంజుకుంటోంది. ముఖ్యంగా గ్లోబల్ మార్కెట్లలో బంగారానికి గిరాకీ ఊపందుకుంది. దీనివల్ల దేశీయంగా కూడా పసిడిపై పెట్టుబడులు భారీగా పెరిగాయి.

సోమవారం ఒక్కరోజే స్పాట్ మార్కెట్లో పసిడి ధర రూ. 950 కి పెరిగింది. వెండి సైతం స్పాట్ మార్కెట్లో రూ. 1500 కంటే ఎక్కువ పెరిగింది. అమెరికాలో సిలికాన్‌ వ్యాలీ బ్యాంక్‌, సిగ్నేచర్‌ బ్యాంక్‌ మూసివేత, ద్రవ్యోల్బణం కట్టడికి ఫెడ్‌ రేట్ల పెంపు సూచనలతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతిన్నది. దాంతో పసిడి ధరలు పెరుగుతున్నాయని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీ నివేదికలో వెల్లడించింది.

ఇక, బహిరంగ మార్కెట్లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం హైదరాబాద్‌లో రూ. 330 పెరిగి రూ. 57,220కి చేరుకుంది. ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల బంగారం పది గ్రాములు రూ. 290 పెరిగి రూ. 52.450గా ఉంది. వెండి సైతం రూ. 800 పెరిగి రూ. 69,500కి చేరింది. ఇతర ప్రధాన నగరాల్లో 22 క్యారెట్ బంగారం ధరలను పరిశీలిస్తే, చెన్నైలో రూ. 53,250, ఢిల్లీలో రూ. 52,600, ముంబై, కోల్‌కతాల్లో రూ. 52,450, బెంగళూరులో రూ. 52,500గా ఉంది.


Next Story

Most Viewed