ఏప్రిల్‌లో స్టార్ట్ కానున్న గెయిల్ మొదటి గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్‌

by Disha Web Desk 17 |
ఏప్రిల్‌లో స్టార్ట్ కానున్న గెయిల్ మొదటి గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్‌
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వ ఆధ్వర్యంలోని సహజ వాయువు కంపెనీ గెయిల్ (ఇండియా) లిమిటెడ్ తన మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించనుంది. సంబంధిత వర్గాల నుంచి వచ్చిన సమాచారం ప్రకారం, ఇది ఏప్రిల్ నెలలో ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇప్పటికే మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని విజయపూర్ కాంప్లెక్స్‌లోని గ్రీన్-హైడ్రోజన్ ఉత్పత్తి యూనిట్ కోసం 10-మెగావాట్ల ప్రోటాన్ ఎక్స్ఛేంజ్ మెమ్బ్రేన్ ఎలక్ట్రోలైజర్‌ను కెనడా నుండి దిగుమతి చేసుకున్నట్లు వారు తెలిపారు. ఇంకా కొన్ని పనులు మిగిలి ఉన్న తరుణంలో వాటిని కూడా పూర్తి చేసిన తరువాత వచ్చే నెలలో ఉత్పత్తి ప్రారంభిస్తామని వారు అన్నారు. ఈ ప్లాంట్ నుంచి రోజుకు సుమారు 4.3 మెట్రిక్ టన్నుల హైడ్రోజన్‌ ఉత్పత్తి అవుతుందని అంచనా. ఇది విలువలో 99.999 శాతం స్వచ్ఛత, పునరుత్పాదక శక్తిని ఉపయోగిస్తుంది. భారత్ 2030 నాటికి వార్షిక గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి సామర్థ్యాన్ని 5 మిలియన్ టన్నులకు చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.


Next Story