మార్చిలో ఇప్పటివరకు రూ. 38 వేల కోట్ల విదేశీ పెట్టుబడులు

by Dishanational1 |
మార్చిలో ఇప్పటివరకు రూ. 38 వేల కోట్ల విదేశీ పెట్టుబడులు
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారతీయ ఈక్విటీల్లో విదేశీ ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నారు. ప్రపంచ ఆర్థికవ్యవస్థలో అనుకూల పరిణామాలు, భారత ఆర్థిక వృద్ధి బలంగా ఉండటం వంటి అంశాలు వారిని ఆకట్టుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) ఈ నెలలో ఇప్పటివరకు రూ. 38,000 కోట్లకు పైగా నిధులను దేశీయ ఈక్విటీల్లో పెట్టారు. అంతకుముందు జనవరిలో రూ. 25,743 కోట్ల భారీ పెట్టుబడుల తర్వాత గత నెల ఫిబ్రవరిలో రూ. 1,539 కోట్ల తక్కువ పెట్టుబడులు వచ్చాయి. మార్చిలో మళ్లీ ఎఫ్‌పీఐలు పెట్టుబడులు పెంచడం గమనార్హం. డిపాజిటరీ గణాంకాల ప్రకారం, ఈ ఏడాదిలో ఇప్పటివరకు ఎఫ్‌పీఐలు రూ. 13,893 కోట్లు ఈక్విటీల్లోకి, రూ. 55,480 కోట్లను డెట్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేశారు. ఫిబ్రవరిలో మార్కెట్ల నుంచి నిధులను ఉపసంహరించుకున్న ఎఫ్‌పీఐలు మార్చిలో తిరిగి కొనుగొళ్లకు సిద్ధమయ్యారు. భారత జీడీపీ వృద్ధి, ఆర్‌బీఐ అంచనాలు, వచ్చే ఆర్థిక సంవత్సరం చివర్లో కీలక వడ్డీ రేట్లు 20-50 బేసిస్ పాయింట్ల మేర తగ్గవచ్చనే నిపుణుల అంచనాలతో విదేశీ ఇన్వెస్టర్లు సానుకూలంగా ఉన్నారని మార్నింగ్‌స్టార్ ఇన్వెస్ట్‌మెంట్ రీసెర్చ్ ఇండియా మేనేజర్ రీసెర్చ్ అసోసియేట్ డైరెక్టర్ హిమాన్షు శ్రీవాస్తవ పేర్కొన్నారు.


Next Story