PAN Aadhaar Linking Check :మీ ఆధార్‌‌తో పాన్‌ లింక్ అయిందో లేదో మెసేజ్ ద్వారా ఈ విధంగా తెలుసుకోండి!

by Disha Web Desk 17 |
PAN Aadhaar Linking Check :మీ ఆధార్‌‌తో పాన్‌ లింక్ అయిందో లేదో మెసేజ్ ద్వారా ఈ విధంగా తెలుసుకోండి!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రతి ఒక్కరూ తమ ఆధార్‌తో పాన్ కార్డ్‌లను లింక్ చేసుకోవాలని ప్రభుత్వం ఎప్పటినుంచో పేర్కొంటుంది. అయితే చాలా కాలంగా ఆధార్-పాన్ లింకింగ్ తేదీని పెంచుతున్న ప్రభుత్వం ఇటీవల చివరి తేదీని ప్రకటించింది. 1961లోని సెక్షన్ 139AA ప్రకారం మార్చిన 31 నాటికి ఆధార్‌ను పాన్‌తో లింక్ చేయకపోతే పాన్‌కార్డు ఏప్రిల్ 1, 2023 నుండి పనిచేయదని ప్రభుత్వం తెలిపింది. అయితే ఇప్పటికే చాలా మంది తమ ఆధార్‌ను పాన్‌తో లింక్ చేసుకున్నారు. ఇంకా కొంత మందికి తమ ఆధార్-పాన్ లింక్ చేయబడిందో లేదో తెలుసుకోవాలనుకుంటున్నారు. అలాంటి వారి కోసం సులభంగా మెసేజ్ ద్వారా తెలుసుకోవచ్చు.


SMS ద్వారా ఆధార్ పాన్‌తో లింక్ అయిందో లేదో తెలుసుకోడానికి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి UIDPAN అని టైప్ చేసి 567678 లేదా 56161కి సెండ్ చేయాలి. తరువాత డేటాబేస్‌లో చెకింగ్ పూర్తయిన తరువాత ఆధార్-పాన్ లింకింగ్ గురించిన స్టేటస్ మెసేజ్ ద్వారా వస్తుంది. వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవాలనుకునే వారు https://www.pan.utiitsl.com/panaadhaarlink/forms/pan.html/panaadhaar లో పాన్ నంబర్, పుట్టిన తేదీ, క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేసి స్టేటస్‌ను చెక్ చేసుకోవచ్చు.

Read more:

Bank Loan : మీ పేరు పై నకిలీ రుణాలు ఉన్నాయా ? అయితే ఈ విధంగా చెక్ చేసుకోండి

LIC జీవన్ సరళ్ పాలసీతో రూ. 15 లక్షలకు పైగా ఆదాయం



Next Story

Most Viewed