Bank Loan : మీ పేరు పై నకిలీ రుణాలు ఉన్నాయా ? అయితే ఈ విధంగా చెక్ చేసుకోండి !

by Disha Web Desk 10 |
Bank Loan : మీ పేరు పై నకిలీ రుణాలు ఉన్నాయా ? అయితే  ఈ విధంగా చెక్ చేసుకోండి !
X

దిశ, వెబ్ డెస్క్ : ఈ మధ్య కాలంలో సైబర్ నేరగాళ్ళు ఎక్కువై పోయారు. మన ప్రమేయం లేకుండా మనకి సంబందించిన విషయాలన్ని వారికి తెలిసి పోతున్నాయి. అలాగే మీ ప్రమేయం లేకూండా మీ పేరుపై మీకు తెలియని మనుషులు లోన్ కూడా తీసుకుంటారు. వారు లోన్ తీసుకున్నట్టు మనకి తెలీదు. కానీ లోన్ అమౌంట్ మొత్తం మన మీదే పడుతుంది.

అలాగే వివిధ వ్యక్తుల పేర్ల మీద సైబర్ నేరగాళ్లు రుణాలను తీసుకుంటారు. వారు రుణాలు తీసుకున్నట్టు అసలు వ్యక్తులకు తెలియదు. వారు తెలుసుకునే లోపు అప్పటికే వడ్డీ ఎక్కువుతుంది. సైబర్ నేరగాళ్లు ముఖ్యంగా మొబైల్, పాన్ కార్డు ఆధారంగా మోసాలకు పాల్పడుతుంటారు. కాబట్టి మీ వ్యక్తిగత బ్యాంక్ వివరాలను ఎవరికి చెప్పకండి. బ్యాంక్ ద్వారా ముందు మీ సిబిల్ స్కోర్ చెక్ చేపించుకోండి. ఇలా చేయడం వల్ల మీ పేరిట ఉన్న రుణాలు ఉంటె ఇట్టే తెలిసి పోతాయి.

Next Story