Google Pay లో మొబైల్ రీఛార్జ్‌లపై ఎక్స్‌ట్రా ఫీజు!

by Disha Web Desk 17 |
Google Pay లో మొబైల్ రీఛార్జ్‌లపై ఎక్స్‌ట్రా ఫీజు!
X

దిశ, వెబ్‌డెస్క్: డిజిటల్ పేమెంట్ యాప్ Google Pay యూజర్లకు షాక్ ఇస్తుంది. ఈ యాప్ ద్వారా మొబైల్ రీఛార్జ్ చేస్తే అదనంగా కన్వీనియన్స్ ఫీజును వసూలు చేస్తుంది. గూగుల్ పే నుంచి కార్డు,UPI లేదా ఏ ఇతర విధంగా అయిన రీచార్జ్ చేసినట్లయితే స్వల్ప మొత్తంలో ఫీజును చార్జ్ చేస్తుంది. ఇంతకుముందు ఈ సదుపాయాన్ని ఉచితంగా అందించిన కంపెనీ ఇకమీదట ఫీజును మొదలుపెట్టింది. ఈ విషయాన్ని ఒక యూజర్ బయటపెట్టాడు.

అతను Google Pay నుంచి Jio రూ.749 ప్లాన్‌ను రీఛార్జ్ చేయగా అతనికి అదనంగా రూ.3 కన్వీనియన్స్ ఫీజుతో మొత్తం రూ.752 చూపించింది. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్‌ను అతను షేర్ చేశాడు. కొంతమంది యూజర్లకు మాత్రమే ఫీజును వసూలు చేస్తుండగా, మరికొంత మందికి మాత్రం ఎలాంటి ఎక్స్‌ట్రా చార్జ్ చూపించడం లేదు. కానీ త్వరలో అందరికీ ఫీజును వసూలు చేసే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.

టిప్‌స్టర్ ముకుల్ శర్మ ఈ అదనపు చార్జ్ గురించిన వివరాలను X లో పేర్కొనాడు. రూ.100 లోపు రీచార్జ్‌లపై గూగుల్‌ పే ఎలాంటి ఫీజు వసూలు చేయదని, రూ.100-రూ.200 వరకు అయితే రూ.1, రూ.200-రూ.300 కు రూ.2, అదే రూ.300 కంటే ఎక్కువ అయితే రూ.3 చొప్పున కన్వీనియన్స్ ఫీజు వసూలు చేస్తుందని తెలిపాడు.


Next Story