ఎలాన్ మస్క్‌కు బిగ్ షాక్: భారీగా తగ్గుతున్న సంపద.. కారణం ట్విట్టరేనా?!

by Disha Web Desk 17 |
ఎలాన్ మస్క్‌కు బిగ్ షాక్: భారీగా తగ్గుతున్న సంపద.. కారణం ట్విట్టరేనా?!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ కుబేరుల జాబితాలో అగ్రస్థానంలో ఉన్న ఎలాన్ మస్క్‌కు బిగ్ షాక్ తగిలింది. ఆయన సంపద గత ఏడాది కాలంగా తగ్గుతూ వస్తుంది. బ్లూమ్‌బర్గ్ నివేదిక ప్రకారం.. మస్క్ సంపద ఏడాదిలో 100.5 బిలియన్ డాలర్లు తగ్గింది. ఆయన ప్రధాన ఆదాయం టెస్లా షేర్ల నుంచి వస్తుంది, కానీ ఇటీవల టెస్లా షేర్లు క్రమంగా క్షీణిస్తూ వస్తున్నాయి. పైగా ఈ మధ్యకాలంలో 19 బిలియన్ డాలర్ల విలువ గల టెస్లా షేర్లను అమ్మి ట్విట్టర్‌ను కొనుగోలు చేశారు. దీని వలన కూడా ఆయన సంపద తగ్గిందని నివేదిక తెలిపింది. అయినప్పటికీ కూడా ఎలాన్ మస్క్ ప్రపంచ ధనవంతుల జాబితాలో 169.9 బిలియన్ డాలర్ల నికర సంపదతో అగ్రస్థానంలో ఉన్నారు.

ఇవి కూడా చదవండి : 2047 నాటికి 40 ట్రిలియన్ డాలర్లకు భారత ఆర్థిక వ్యవస్థ: ముఖేశ్ అంబానీ!


Next Story