మార్చిలో 21 శాతం పెరిగిన విమాన ప్రయాణికులు!

by Disha Web Desk 17 |
మార్చిలో 21 శాతం పెరిగిన విమాన ప్రయాణికులు!
X

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కారణంగా కుదేలైన భారత విమానయాన రంగం తిరిగి పుంజుకుంటోంది. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో పరిశ్రమ ఏకంగా 51.7 శాతం ప్రయాణికుల వృద్ధిని సాధించింది. అదే కాలంలో మొత్తం 3.75 కోట్ల మంది ప్రయాణం చేశారని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) తాజా గణాంకాల్లో వెల్లడించింది. గతేడాది జనవరి-మార్చి మధ్య మొత్తం 2.47 కోట్ల మంది ప్రయాణించారు. మార్చి నెలలో మాత్రమే 1.28 కోట్ల మంది ప్రయాణించారని, ఇది గతేడాది కంటే 20 శాతం ఎక్కువ.

నెలవారీగా చూస్తే ఈ ఏడాది ఫిబ్రవరి కంటే 21.41 శాతం ప్రయాణికులు పెరిగారు. డీజీసీఏ డేటా ప్రకారం, ప్రైవేటు రంగ విమానయాన సంస్థ ఇండిగో మార్చిలో అత్యధికంగా 56.8 శాతం మార్కెట్ వాటాతో అగ్రస్థానంలో నిలిచింది. గత నెలలో మొత్తం 73.17 లక్షల మంది ఇండిగో విమానాల్లో ప్రయాణించగా, 11.49 లక్షల మంది(8.9 శాతం మార్కెట్ వాటా)తో విస్తారా, 11.39 లక్షల(8.8 శాతం మార్కెట్ వాటా)తో ఎయిర్ ఇండియా రెండు, మూడో స్థానాల్లో ఉన్నాయి.

కొత్తగా విమానయాన రంగంలోకి అడుగుపెట్టిన ఆకాశ మార్కెట్ వాటా స్వల్పంగా 0.3 శాతం పెరిగింది. స్పైస్‌జెట్ 0.70 శాతం, గోఫస్ట్ 1 శాతం మార్కెట్ వాటాను పెంచుకున్నాయని గణాంకాలు పేర్కొన్నాయి.

Also Read..

రూ. 33 లక్షల కోట్ల సేవల ఎగుమతులు!



Next Story

Most Viewed