బంగారం అసలుదా.. నకిలీదా.. అని ఈ విధంగా మీ ఫోన్‌లోనే చెక్ చేసుకోండి!

by Disha Web Desk 17 |
బంగారం అసలుదా.. నకిలీదా.. అని ఈ విధంగా మీ ఫోన్‌లోనే చెక్ చేసుకోండి!
X

దిశ, వెబ్‌డెస్క్: భారతీయ ప్రజలకు ఎంతో ఇష్టమైనది బంగారం. చేతిలో డబ్బులు ఉంటే చాలు ఎంతో కొంత బంగారాన్ని కొనుగోలు చేసి ఇంట్లో దాచి పెడతారు. అయితే ఈ మధ్య కాలంలో బంగారం కొనుగోలు సమయంలో వినియోగదారులు మోసపోతున్నారు. బంగారం స్వచ్ఛమైనదో నకిలీదో తెలుసుకోలేకపోతున్నారు. దీని గురించి ప్రభుత్వానికి పలువురు ఫిర్యాదులు కూడా చేశారు. ఇప్పటికే బంగారం రేటు చాలా ఎక్కువగా ఉంది. సామాన్యులు కొనలేని పరిస్థితులు ఉన్నాయి. ఒకవేళ కష్టపడి కొనుగోలు చేసిన, అది అసలుదా.. నకిలీదా.. అని తెలుసుకోలేకపోతున్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వం కొత్తగా కీలక చర్యలు మొదలుపెట్టింది.


బంగారు ఆభరణాల అమ్మకాలకు సంబంధించి ఆరంకెల కోడ్‌తో(HUID) హాల్ మార్క్ కలిగిన బంగారాన్ని మాత్రమే అమ్మాలని అమ్మకం దారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ కొత్త నిబంధన ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. దీనికి అనుగుణంగా భారత ప్రమాణాల సంస్థ (బీఐఎస్) ప్రత్యేకంగా BIS Care App ను విడుదల చేసింది. ఈ యాప్‌లో బంగారంకు ఉన్న ఆరంకెల కోడ్‌‌(HUID)ను ఎంటర్ చేస్తే, అది అసలుదో నకిలీదో తెలుసుకోవచ్చు.



BIS ఆదేశాల ప్రకారం, బంగారం ముద్రించే సమయంలో తప్పనిసరిగా BIS లోగో, నాణ్యత, 6 అంకెలు- అక్షరాలతో కూడిన HUID నెంబర్‌ను ముద్రించాలి. తయారీ సంస్థలు కచ్చితంగా ఈ నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. బంగారం కొనుగోలు చేసేటప్పుడు వినియోగదారులు HUIDని BIS యాప్‌లో ఎంటర్ చేయగానే ఆ బంగారం, అసలుదా లేక నకిలీదా, తయారు చేసిన సంవత్సరం, తయారు చేసిన వారి వివరాలు మొదలగునవి తెలుస్తాయి.



Read more:

బంగారం అందానికే కాదండోయ్.. ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిదంట?

Next Story