కేంద్ర ఆర్థికశాఖ కీలక నిర్ణయం.. GST లో కొత్త రూల్

by Disha Web Desk 2 |
కేంద్ర ఆర్థికశాఖ కీలక నిర్ణయం.. GST లో కొత్త రూల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: కేంద్ర ఆర్థికశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. వ్యాపార సంస్థలకు మే 1 నుంచి న్యూ జీఎస్టీ రూల్‌ అమల్లోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. రూ.100 కోట్లు, అంతకంటే ఎక్కువ టర్నోవర్ ఉన్న వ్యాపార సంస్థలు తమ ఎలక్ట్రానిక్ ఇన్వాయిస్‌ను జారీ చేసిన 7 రోజుల్లోగా ఐఆర్‌పీ (ఇన్‌వాయిస్ రిజిస్ట్రేషన్ పోర్టల్)లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుందని జీఎస్టీ నెట్‌వర్క్ తెలిపింది. అలాంటి ఇన్వాయిస్ ఇష్యూ చేసిన తర్వాత వాటిని ఇన్వాయిస్ రిజిస్ట్రేషన్ పోర్టల్ (ఐఆర్‌పీ)లో 7 రోజుల్లోపు అప్‌లోడ్ చేయాలి. ఈ మేరకు ట్యాక్స్ పేయర్స్‌కు జీఎస్టీ నెట్‌వర్క్ (జీఎస్టీఎన్) అడ్వైజరీ జారీ చేసింది. ‘పాత ఇన్వాయిస్‌లను ఇ-ఇన్వాయిస్ పోర్టల్ ఐఆర్‌పీలో రిపోర్టింగ్ చేసేందుకు కాల పరిమితి విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ట్యాక్స్ పేయర్స్ వారి వార్షిక టర్నోవర్ రూ.100 కోట్లు అంతుకు మించిన వారికి ఈ కొత్త రూల్ వర్తిస్తుంది. ఇచ్చిన గడువులోపు పాత ఇన్వాయిస్‌లను ఐఆర్‌పీ పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలి. ఏడు రోజులకు పైబడిన ఇన్వాయిస్ రిపోర్ట్ చేసేందుకు అనుమతించడం కుదరదు. పాత ఇన్వాయిస్‌లను అందించేందుకు ట్యాక్స్ పేయర్స్‌కు సరైన సమయం ఇస్తున్నాం. ఈ కొత్త ఫార్మాట్ మే 1, 2023 నుంచి అమలులోకి వస్తుంది’ అని జీఎస్‌టీ నెట్‌వర్క్ పేర్కొంది. ఈ పరిమితి ఇన్‌వాయిస్‌లకు మాత్రమే వర్తిస్తుంది. డెబిట్ లేదా క్రెడిట్ నోట్‌లను నివేదించడంలో ఎలాంటి కాలపరిమితి లేదని తెలిపింది. జీఎ‍స్టీ చట్టం ప్రకారం.. ఐఆర్‌పీలో ఇన్‌వాయిస్‌లు అప్‌లోడ్ చేయకపోతే వ్యాపార సంస్థలు ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ) పొందలేవు. ప్రస్తుతం రూ. 10 కోట్లు, అంతకంటే ఎక్కువ టర్నోవర్ ఉన్న వ్యాపార సంస్థలు అన్ని బీ2బీ లావాదేవీల కోసం ఎలక్ట్రానిక్ ఇన్‌వాయిస్‌ను రూపొందించడం తప్పనిసరి.

Also Read...

మే 1 నుంచి వ్యాపార సంస్థలకు కొత్త జీఎస్టీ నిబంధన!


Next Story