55 వేల తొలగింపులు ప్రకటించిన బీటీ గ్రూప్!

by Disha Web Desk 17 |
55 వేల తొలగింపులు ప్రకటించిన బీటీ గ్రూప్!
X

న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా భారీ లేఆఫ్స్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే దిగ్గజ టెక్ కంపెనీలు తొలగింపులను ప్రకటించగా, ఇటీవల టెలికాం దిగ్గజం వొడాఫోన్ కూడా లేఆఫ్స్ ప్రకటించింది. తాజాగా బ్రిటన్‌కు చెందిన మల్టీ నేషనల్ టెలీ కమ్యూనికేషన్ సంస్థ బీటీ గ్రూ భారీగా ఉద్యోగాల తొలగింపును ప్రకటించింది. రాబోయే 5-7 ఏళ్లలో 55,000 మంది ఉద్యోగులను తీసేయనున్నట్టు కంపెనీ వెల్లడించింది.

ప్రతికూల పరిస్థితుల మధ్య ఖర్చులను తగ్గించడంతో పాటు సంస్థను లాభదాయకత వైపు కొనసాగించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని కంపెనీ గురువారం ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం బీటీ గ్రూప్‌లో మొత్తం 1.30 లక్షల మంది పని చేస్తుండగా, 2028-30 నాటికి ఉద్యోగులను సంఖ్యను 75,000-90,000కు కుదించాలని నిర్ణయించామని కంపెనీ సీఈఓ ఫిలిప్ జాన్సన్ అన్నారు.

ఇదే సమయంలో కంపెనీని డిజిటలైజ్ చేసి మరింత సమర్థవంతంగా మార్చాలని నిర్ణయించామని, పనితీరును సరళతరం చేయాలనే లక్ష్యంతో ఉన్నామన్నారు. 2030 నాటికి పూర్తిస్థాయి ఫైబర్ నెట్‌వర్క్ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని ఆయన పేర్కొన్నారు.

Next Story

Most Viewed