WhatsApp ద్వారా ఇలా గ్యాస్ సిలిండర్‌ బుక్ చేసుకోండి!

by Disha Web Desk 17 |
WhatsApp ద్వారా ఇలా గ్యాస్ సిలిండర్‌ బుక్ చేసుకోండి!
X

దిశ, వెబ్‌డెస్క్: మెసేజ్‌లు, చాటింగ్‌లకు మాత్రమే ఉపయోగపడే వాట్సాప్ క్రమంగా అన్ని రకాల సదుపాయాలను తీసుకొస్తుంది. ఇప్పటికే ఈ కామర్స్‌గా సేవలు అందిస్తోన్న యాప్, ఇప్పుడు గ్యాస్‌ సిలిండర్‌ను డైరెక్ట్‌గా వాట్సాప్ నుంచే బుక్ చేసుకునే ఆప్షన్‌ను అందిస్తోంది. ఇప్పటికే సంబంధిత ఏజెన్సీ డీలర్ నంబర్‌కి ఫోన్ లేదా SMS చేసి గ్యాస్ బుక్ చేసుకునే ఆప్షన్ ఉంది. కానీ వాట్సాప్ ద్వారా బుకింగ్ విధానం సులభంగా ఉంటుంది. ప్రస్తుతం HP Gas, Bharath Gas, Indane Gas వాట్సాప్ ద్వారా గ్యాస్‌ బుకింగ్‌లను అందిస్తున్నాయి. అలాగే, డైరెక్ట్‌గా పేమెంట్ ఆప్షన్‌ కూడా దీనిలో ఉంది. రిజిస్టర్డ్ నంబర్‌‌లో సంబంధిత ఏజెన్సీ నంబర్‌‌ను సేవ్ చేసుకుని వాట్సాప్‌లో బుకింగ్ చేయవచ్చు.

Bharath Gas: భారత్ గ్యాస్ వినియోగదారులు గ్యాస్ సిలిండర్ బుకింగ్ చేయడానికి 1800224344 నంబర్‌ను ఫోన్‌లో సేవ్ చేసుకోని Hi అని మెసేజ్ చేయాలి. బుకింగ్, సిలిండర్ పేమెంట్, రివార్డ్స్ అండ్ ఆఫర్స్ వంటి ఆప్షన్లు వస్తాయి. అందులో కావాల్సిన ఆప్షన్ ఎంచుకోవాలి. దీనిలో గూగుల్ పే, పేటీఎం, అమెజాన్ పే ద్వారా పేమెంట్ కూడా చేయవచ్చు.

Indane Gas: ఇండేన్ గ్యాస్ వినియోగదారులు 7588888824 లేదా 7718955555 నంబర్‌ను వాట్సాప్‌లో సేవ్ చేసుకుని ‘REFILL’ అని టైప్ చేస్తే గ్యాస్ బుకింగ్ ఆప్షన్స్ వస్తాయి. కావాల్సిన దాన్ని ఎంచుకుని పేమెంట్ చేయవచ్చు.

HP Gas: ఈ గ్యాస్ వినియోగదారులు 9222201122 నంబర్‌‌ను సేవ్ చేసుకుని ‘BOOK’ అని టైప్ చేస్తే సిలిండర్ బుకింగ్‌ అయి పేమెంట్ చేయవచ్చు. బుకింగ్‌తో పాటు పలు ఆప్షన్స్ కూడా ఉంటాయి.



Next Story

Most Viewed