10 ఏళ్ల తర్వాత ఐపీఓకు ఎయిర్‌టెల్ గ్రూప్ కంపెనీ

by Dishanational1 |
10 ఏళ్ల తర్వాత ఐపీఓకు ఎయిర్‌టెల్ గ్రూప్ కంపెనీ
X

దిశ, బిజినెస్ బ్యూరో: టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ అనుబంధ కంపెనీ భారతీ హెక్సాకామ్ త్వరలో ఐపీఓకు రానుంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో పబ్లిక్ ఇష్యూకు రావడానికి కంపెనీ సిద్ధమవుతోంది. ఐపీఓ నుంచి భారతీ హెక్సాకామ్ రూ. 4,300 కోట్ల వరకు నిధులను సమీకరించనుంది. కమ్యూనికేషన్స్ సొల్యూషన్స్ ప్రొవైడర్ అయిన భారతీ హెక్సాకామ్ తన ప్రాథమిక వాటా విక్రయం కోసం ఇప్పటికే మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి పబ్లిక్ ఆఫర్‌కు ఆమోదం లభించగా, ఏప్రిల్ మొదటివారంలోనే ప్రక్రియ ప్రారంభం కానున్నట్టు సమాచారం. భారతీ హెక్సాకామ్ ప్రమోటర్ కంపెనీ భారతీ ఎయిర్‌టెల్ కంపెనీలో 70 శాతం వాటా అంటే 35 కోట్ల ఈక్విటీ షేర్లను కలిగి ఉంది. మిగిలిన 30 శాతం వాటా భారత ప్రభుత్వం వద్ద ఉంది. భారతీ గ్రూప్ నుంచి 10 ఏళ్లకు పైగా విరామం తర్వాత ఒక కంపెనీ ఐపీఓకు వస్తుండటం విశేషం. కొన్నేళ్ల నుంచి ఐపీఓకు రావడానికి ప్రయత్నిస్తున్న హెక్సాకామ్ ఇటీవలే సెబీ నుంచి అనుమతి పొందింది. చివరిగా 2012లో భారతీ గ్రూప్ నుంచి భారతీ ఇన్‌ఫ్రాటెల్ ఐపీఓకు వచ్చింది. ప్రస్తుతం ఈ కంపెనీ ఇండస్ టవర్స్ పేరుతో కొనసాగుతోణ్ది. హెక్సాకామ్ కంపెనీ రాజస్థాన్‌తో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో మొబైల్, ఫిక్స్‌డ్ లైన్, బ్రాడ్‌బ్యాండ్ సేవలందిస్తోంది.



Next Story

Most Viewed