కస్టమర్లకు షాక్ ఇచ్చిన Axis Bank!

by Disha Web Desk 17 |
కస్టమర్లకు షాక్ ఇచ్చిన Axis Bank!
X

న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ యాక్సిస్ బ్యాంక్ తన ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్లను తగ్గిస్తున్నట్టు తెలిపింది. రూ. 2 కోట్ల కంటే తక్కువ మొత్తాలపై డిపాజిట్ రేట్లను 5-20 బేసిస్ పాయింట్ల మేర తగ్గిస్తూ బ్యాంకు నిర్ణయించింది. బ్యాంకు అధికారిక వెబ్‌సైట్ వివరాల ప్రకారం, సాధారణ ఖాతాదారులకు 7-14 రోజుల కాలవ్యవధి కలిగిన డిపాజిట్లపై బ్యాంకు 3.50 శాతం ప్రారంభ వడ్డీని అందిస్తోంది. అలాగే, గరిష్ఠంగా 13 నెలల కాలానికి 7.10 శాతం వడ్డీని ఇస్తోంది.

ఏడాది నుంచి ఏడాది 4 రోజుల కాలవ్యవధి కలిగిన ఎఫ్‌డీలపై 5 బేసిస్ పాయింట్లు తగ్గించి 6.75 శాతం వడ్డీ ఆదాయాన్ని ఇస్తోంది. ఏడాది 5 రోజుల నుంచి 13 నెలల మధ్య డిపాజిట్లపై 7.10 శాతం నుంచి 6.80 శాతానికి, 13 నెలల నుంచి 2 ఏళ్లలోపు డిపాజిట్లపై 7.10 శాతం, 2 ఏళ్ల నుంచి 30 నెలల్లోపు డిపాజిట్లపై 7.05 శాతం వడ్డీని ఇవ్వనున్నట్టు బ్యాంకు వెల్లడించింది. సీనియర్ సిటిజన్లు ఎఫ్‌డీలపై కనిష్ట వడ్డీ 3.50 శాతం నుంచి అధికంగా 7.85 శాతం వడ్డీ రాబడిని పొందవచ్చని బ్యాంకు పేర్కొంది.


Next Story