ఏప్రిల్-22: మహిళలకు గుడ్ న్యూస్.. నేడు భారీగా తగ్గిన బంగారం ధరలు

by Disha Web Desk 6 |
ఏప్రిల్-22: మహిళలకు గుడ్ న్యూస్.. నేడు భారీగా తగ్గిన బంగారం ధరలు
X

దిశ,ఫీచర్స్: మహిళలు ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా సరే బంగారం కొనుగోలు చేస్తుంటారు. అయితే ఇటీవల పసిడి రేట్లు భారీగా పెరగడంతో బంగారం పేరు వింటేనే భయపడిపోతున్నారు. పెళ్లిళ్లు ఉండటంతో బంగారం పరుగులు పెడుతోంది. దీంతో కొనుగోలు దారులు తలలు పట్టుకుంటున్నారు. అయితే నేడు బంగారం ధరలు తగ్గి గుడ్ న్యూస్ అందించాయి.

నిన్నటి ధరలతో పోల్చుకుంటే.. నేడు 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 500 తగ్గడంతో రూ. 67,550గా ఉంది. అలాగే 24 క్యారెట్ల బంగారంపై రూ. 550 తగ్గగా.. రూ. 73, 690కి విక్రయిస్తున్నారు. అలాగే కిలో వెండిపై రూ. 1000 తగ్గగా.. రూ 89,000గా ఉంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో బంగారం రేట్లు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.

హైదరాబాద్‌లో నేటి బంగారం ధరలు:

22 క్యారెట్ల బంగారం ధర- రూ. 67,550

24 క్యారెట్ల బంగారం ధర- రూ. 73, 690

విజయవాడలో బంగారం ధరలు:

22 క్యారెట్ల బంగారం ధర- రూ. 67,550

24 క్యారెట్ల బంగారం ధర- రూ. 73, 690



Next Story

Most Viewed