ఏప్రిల్-12: బిగ్ షాకిచ్చిన బంగారం ధరలు.. తులం ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

by Disha Web Desk 6 |
ఏప్రిల్-12: బిగ్ షాకిచ్చిన బంగారం ధరలు.. తులం ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?
X

దిశ, ఫీచర్స్: బంగారం ధరలు రోజు రోజుకూ పెరుగుతు కొనుగోలు దారులకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. మార్చి నెల మొత్తం అంతంత మాత్రంగా పెరిగిన పసిడి రేట్లు.. ఏప్రిల్ మొదటి వారానికి ఏకంగా రూ. 70 వేలకు చేరుకుని అందరినీ షాక్‌కు గురి చేస్తున్నాయి. దీంతో పసిడి ప్రియులు బంగారం పేరు వింటేనే భయపడిపోతున్నారు. పెళ్లిళ్ల సీజన్ వేళ.. బంగారం ధరలు పెరుగుతున్నాయి తప్ప తగ్గడం లేదు.

నేడు మరోసారి బంగారం రేట్లు భారీగా పెరిగాయి. నిన్నటి ధరలతో పోల్చుకుంటే.. 22 క్యారెట్ల బంగారంపై రూ. 1000 పెరగ్గా.. రూ. 67, 200గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధరపై ఏకంగా రూ.1,090 పెరగడంతో రూ. 73,310కి చేరుకుంది. అలాగే కిలో వెండిపై రూ. 1500 పెరిగి.. రూ. 90, 000కి చేరుకుంది. అయితే ప్రధాన నగరాలైన హైదరాబాద్‌, విజయవాడలో రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

హైదరాబాద్‌లో నేటి బంగారం ధరలు:

22 క్యారెట్ల బంగారం ధర- రూ. 67,200

24 క్యారెట్ల బంగారం ధర- రూ.73,310

విజయవాడలో నేటి బంగారం ధరలు:

22 క్యారెట్ల బంగారం ధర- రూ. 67,200

24 క్యారెట్ల బంగారం ధర- రూ.73,310



Next Story