ఉద్యోగుల సంఖ్యను రెట్టింపు చేయనున్న యాపిల్ సరఫరా కంపెనీ సాల్‌కాంప్!

by Disha Web Desk 13 |
ఉద్యోగుల సంఖ్యను రెట్టింపు చేయనున్న యాపిల్ సరఫరా కంపెనీ సాల్‌కాంప్!
X

చెన్నై: ప్రముఖ ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల సంస్థ యాపిల్‌ సరఫరాదారు ఫిన్‌లాండ్‌కు చెందిన సాల్‌కాంప్ రాబోయే మూడేళ్లలో దేశీయంగా ఉద్యోగుల సంఖ్యను రెట్టింపు చేయనున్నట్టు వెల్లడించింది. 2025 నాటికి కంపెనీ తన వార్షికాదాయాన్ని కనీసం రూ. 16.54 వేల కోట్ల(2 బిలియన్ డాలర్ల) నుంచి రూ. 24.81 వేల కోట్ల(3 బిలియన్ డాలర్ల)కు పెంచాలని లక్ష్యంగా ఉన్నామని, ఉద్యోగులను 25 వేలకు పెంచాలని భావిస్తున్నట్టు సాల్‌కాంప్ మాన్యుఫక్చరింగ్ ఇండియా ఎండీ శశికుమార్ గెంధం అన్నారు.

యాపిల్ సంస్థ కఠిన లాక్‌డౌన్‌తో పాటు చైనా, యూఎస్ మధ్య నెలకొన్న వాణిజ్య, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల మధ్య అక్కడి నుంచి ఉత్పత్తిని మార్చే ప్రణాళికలను అమలు చేస్తోంది. యాపిల్ సరఫరా కోసం ప్రత్యామ్నాయం చూస్తున్నాం. దానికి భారత్ మెరుగైన ప్రాంతాల్లో ఒకటిగా ఉందని ఆయన తెలిపారు. గత కొన్ని దశాబ్దాలుగా ప్రపంచం మొత్తం చైనా పైనే ఆధారపడి ఉందని అందరికీ తెలుసు.

ఇప్పుడదని క్షీణించే దశకు చేరుకుందని శశి కుమార్ పేర్కొన్నారు. ప్రస్తుతం సాల్‌కాంప్ చెన్నైలో ఉన్న ప్లాంటులో 12 వేల మంది ఉద్యోగులను కలిగి ఉంది. ఈ ప్లాంటులో కంపెనీ ఎక్కువగా ఛార్జర్లను తయారు చేస్తుంది. ఇక్కడే ఇతర స్మార్ట్‌ఫోన్ విడిభాగాలకు కూడా కంపెనీ తయారు చేస్తుంది.

Next Story

Most Viewed