ఇతర దేశాల్లో పెట్టుబడులపై కొత్త నిబంధనలను సిద్ధం చేస్తున్న అమెరికా!

by Disha Web Desk 17 |
ఇతర దేశాల్లో పెట్టుబడులపై కొత్త నిబంధనలను సిద్ధం చేస్తున్న అమెరికా!
X

వాషింగ్టన్: అమెరికా పెట్టుబడిదారులు ఇతర దేశాల్లోని కొన్ని రంగాల్లో చేసే ఇన్వెస్ట్‌మెంట్లపై నిషేధాన్ని విధించాలని, దీని కోసం కొత్త నిబంధనలు తేవాలని అమెరికా ట్రెజరీ డిపార్ట్‌మెంట్ చూస్తున్నట్లు ప్రముఖ వార్తపత్రిక వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. దీనికి సంబంధించి చట్టసభ సభ్యులకు నివేదికలు వెళ్లినట్లు పేర్కొంది. ముఖ్యంగా అమెరికా ప్రత్యర్థి దేశాలపై ఈ నిర్ణయం ఉంటుందని తెలిపింది. అయితే ఈ అంశంలో ఏ ఏ దేశాలు ఉన్నాయో, పేర్కొననప్పటికి ఇటీవల కాలంలో చైనాకు అమెరికాకు మధ్య దూరం పెరుగుతున్న నేపథ్యంలో చైనాలో పెట్టే పెట్టుబడులపైనే ఈ నిర్ణయం ప్రముఖంగా ఉండనున్నట్లు సమాచారం.

కొత్త నిబంధనల ప్రకారం, సూపర్‌కంప్యూటింగ్, అడ్వాన్స్‌డ్ సెమీకండక్టర్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లలో ప్రైవేట్ ఈక్విటీ, వెంచర్ క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్‌లకు ఈ నిషేధం వర్తించే అవకాశం ఉందని తెలుస్తోంది. కొత్త నియంత్రణ వ్యవస్థను వీలైనంత త్వరగా తీసుకురావాలని బైడెన్ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్త సంస్థ నివేదిక పేర్కొంది.



Next Story