వచ్చే పదేళ్లలో మరో 370 విమానాల కొనుగోలుకు ఎయిర్ ఇండియా ఒప్పందం!

by Disha Web Desk 17 |
వచ్చే పదేళ్లలో మరో 370 విమానాల కొనుగోలుకు ఎయిర్ ఇండియా ఒప్పందం!
X

న్యూఢిల్లీ: టాటా గ్రూపునకు చెందిన ఎయిర్ ఇండియా ఇప్పటికే విమానయాన రంగంలో అతిపెద్ద కొనుగోలు ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇటీవలే విమానాల తయారీ సంస్థలైన బోయింగ్​, ఎయిర్‌బస్‌ల నుంచి 470 ఎయిర్‌క్రాఫ్ట్‌ల కోసం ఒప్పందం చేసుకుంది. అయితే, ఇవి కాకుండా అదనంగా మరో 370 విమానాలను కూడా కొనేందుకు ఎయిర్ ఇండియా సిద్ధమైనట్టు తెలుస్తోంది.

ఈ మేరకు ఎయిర్ఇండియా చీఫ్ కమర్షియల్ అండ్ ట్రాన్స్‌ఫర్‌మేషన్ ఆఫీసర్ నిపుణ్ అగర్వాల్ సంస్థ మొత్తం 840 విమానాలకు ఆర్డర్ చేసిందని గురువారం ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే ఒప్పందం జరిగినవి కాకుండా మరో 370 విమానాలను రాబోయే పదేళ్ల కాలంలో కొనుగోలు చేసేందుకు బోయింగ్, ఎయిర్‌బస్ సంస్థలతో చర్చలు జరిగాయని ఆయన స్పష్టం చేశారు.

ఈ ప్రక్రియ విజయవంతమైతే ప్రపంచంలోని ప్రధాన నగరాలన్నింటికీ భారత్ నుంచి విమాన సర్వీసులను నిర్వహించవచ్చు. ఇది ప్రపంచ ఏవియేషన్ రంగంలో ఓ విమానయాన సంస్థ చేసిన అతిపెద్ద ఎయిర్‌క్రాఫ్ట్ ఆర్డర్‌గా నిలుస్తుందని నిపుణ్ అగర్వాల్ అభిప్రాయపడ్డారు.



Next Story

Most Viewed