66 శాతం పెరిగిన ఏజీఐ గ్రీన్‌ప్యాక్ ఆదాయం!

by Disha Web Desk 17 |
66 శాతం పెరిగిన ఏజీఐ గ్రీన్‌ప్యాక్ ఆదాయం!
X

గురుగ్రామ్: ప్రముఖ ప్యాకేజింగ్ కంపెనీ ఏఐజీ గ్రీన్‌ప్యాక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ త్రైమాసికంలో మెరుగైన ఫలితాలను వెల్లడించింది. కంపెనీ వివరాల ప్రకారం, సెప్టెంబర్ త్రైమాసికంలో నికర లాభం రూ. 34 కోట్లుగా నమోదయ్యాయి. గతేడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే 9 శాతం వృద్ధి.

ఇదే సమయంలో కంపెనీ కార్యకలాపాల ఆదాయం రూ. 513 కోట్లు కాగా, ఇది గతేడాది కంటే 66 శాతం ఎక్కువ కావడం గమనార్హం. అదేవిధంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-సెప్టెంబర్ మధ్య కంపెనీ నికర లాభం 101 శాతం వృద్ధితో రూ. 100 కోట్లుగా వెల్లడించింది. సమీక్షించిన కాలంలో కార్యకలాపాల ఆదాయం 72 శాతం పెరిగి రూ. 1,034 కోట్లుగా ప్రకటించింది.

త్రైమాసిక ఫలితాల సందర్భంగా మాట్లాడిన ఏజీఐ గ్రీన్‌ప్యాక్ కంపెనీ వైస్-ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సందీప్ సోమని, సమర్థవంతమైన వ్యాపార వ్యూహం, బలమైన నిర్వహణ సామర్థ్యం, తమ వినియోగదారులతో ఉన్న పటిష్ఠమైన అనుబంధం నేపథ్యంలో కంపెనీ మెరుగైన లాభాలను నమోదు చేసింది. అధిక ద్రవ్యోల్బణం, ఇంధన వ్యయం, కరెన్సీ బలహీన పరిస్థితులు ఉన్నప్పటికీ పనితీరులో రాణించగలిగామని ఆయన వెల్లడించారు.

ఆర్థిక వ్యవస్థలో సవాళ్లు ఉన్నప్పటికీ ప్యాకేజింగ్ ఉత్పత్తులకు డిమాండ్ స్థిరంగా ఉంటుందని ఆశిస్తున్నాం. భవిష్యత్తులో ఉత్పత్తిని పెంచడంతో పాటు విలువ ఆధారిత ఉత్పత్తులను తయారు చేయడంపై దృష్టి సారిస్తామని ఆయన పేర్కొన్నారు.



Next Story

Most Viewed