ప్రపంచంలోనే అతిపెద్ద కాపర్ తయారీ కేంద్రం ఏర్పాటు: అదానీ గ్రూప్

by Dishanational1 |
ప్రపంచంలోనే అతిపెద్ద కాపర్ తయారీ కేంద్రం ఏర్పాటు: అదానీ గ్రూప్
X

దిశ, బిజినెస్ బ్యూరో: బిలియనీర్ గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్ గుజరాత్‌లో ఉన్న ముంద్రాలో ప్రపంచంలోనే అతిపెద్ద సింగిల్-లోకేషన్ కాపర్ తయారీ కేంద్రాన్ని నిర్మించనుంది. ఇది భారత్ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు, ఇంధన పరివర్తనకు సహాయపడుతుందని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. సుమారు రూ. 9,960 కోట్ల విలువైన ఈ తయారీ కేంద్రానికి సంబంధించి మార్చి చివరి నుంచి మొదటి దశ కార్యకలాపాలను ప్రారంభిస్తామని కంపెనీ వెల్లడించింది. 2029 నుంచి పూర్తిస్థాయిలో 10 లక్షల టన్నుల సామర్థ్యంలో ఇక్కడి కార్యకలాపాలు జరుగుతాయని సమాచారం. దీంతో సాంప్రదాయ ఇంధనాల నుంచి దూరంగా ఉండేందుకు కీలకమైన రాగి ఉత్పత్తిని వేగంగా పెంచుతున్న చైనా, ఇతర దేశాల జాబితాలో భారత్‌కు చేరనుంది. గత కొన్నేళ్ల నుంచి దేశీయంగా ఎలక్ట్రిక్ వాహనాలు, ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, సోలార్, బ్యాటరీల వంటి టెక్నాలజీకి రాగి కీలకమైన ముడిపదార్థం. అదానీ గ్రూపునకు చెందిన అదానీ ఎంటర్‌ప్రైజెట్ అనుబంధ కచ్ కాపర్ లిమిటెడ్ రెండు దశాల్లో ఏడాదికి 10 లక్షల టన్నుల శుద్ధి చేసిన రాగి ఉత్పత్తి కోసం గ్రీన్‌ఫీల్డ్ కాపర్ రిఫైనరీని ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే పలు విభాగాల్లో అదానీ గ్రూప్ పట్టును సాధించింది. రాగి ఉత్పత్తిలోనూ అగ్రగామిగా ఎదగాలని ఆశిస్తోంది. 2030 నాటికి ప్రపంచంలోనే అతిపెద్ద రాగి కరిగించే కాంప్లెక్స్‌గా ఎదగాలనే లక్ష్యాన్ని కలిగి ఉన్నట్టు కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది.



Next Story

Most Viewed