అత్యధికంగా సంపద సృష్టించిన జాబితాలో అదానీ కంపెనీలు!

by Disha Web Desk 17 |
అత్యధికంగా సంపద సృష్టించిన జాబితాలో అదానీ కంపెనీలు!
X

న్యూఢిల్లీ: ప్రస్తుత ఏడాదికి సంబంధించి 'వార్షిక సంపద సృష్టి' అధ్యయనంలో అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ ట్రాన్స్‌మిషన్ కంపెనీలు 'ఆల్-రౌండ్' విభాగానికి సంబంధించి అగ్ర స్థానంలో నిలిచాయి. ప్రముఖ ప్రైవేట్ ఈక్విటీ కంపెనీ మోతీలాల్ ఓస్వాల్ రూపొందించిన ఈ నివేదిక ప్రకారం, పరిశీలించిన ఐదేళ్ల కాలం(2017-2022)లో ఈ రెండు కంపెనీల స్టాక్ ధరలు ప్రతి ఏడాది దాదాపు రెండింతలు పెరిగాయి.

ఇక, సమగ్రమైన వృద్ధి పరంగా దేశీయ అత్యంత సంపన్నుడు ముఖేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థ విలువ 2017-2022 మధ్య రూ. 13 లక్షల కోట్లు పెరిగింది. ఆల్-రౌండ్ విభాగంలో అతిపెద్ద, వేగవంతమైన, స్థిరమైన వృద్ధిని పరిగణలోకి తీసుకుని ర్యాంకులను ఇస్తారు. ఇందులో అదానీ ట్రాన్స్‌మిషన్ వేగంగా వృద్ధి చెందిన కంపెనీగా అగ్రస్థానంలో ఉంది.

దీని తర్వాత పతంజలి ఫుడ్స్ ఉండగా, స్థిరమైన వృద్ధిలో అదానీ ఎంటర్‌ప్రైజెస్ మొదటిస్థానంలో నిలిచింది. తర్వాత ఆల్కైల్ అమీన్స్, కోఫోర్జ్ కంపెనీలున్నాయి. ఇక, వొడాఫోన్ ఐడియా(రూ. 1.2 లక్షల కోట్లు), ఇండియన్ ఆయిల్(రూ. 71,300 కోట్లు), కోల్ ఇండియా(రూ. 67,900 కోట్ల) నష్టంతో అత్యధికంగా సంపను కోల్పోయిన జాబితాలో ఉన్నాయి.


Next Story

Most Viewed