ఇండియన్ ‘బోల్ట్’

by  |
ఇండియన్ ‘బోల్ట్’
X

జమైకా చిరుత హుస్సేన్ బోల్ట్‌ను తలపించేలా కర్ణాటకలో శ్రీనివాస్‌గౌడ అనే యువకుడు అతి వేగంగా పరుగెత్తి రికార్డు సృష్టించాడు. ప్రపంచ అథ్లెటిక్స్ పోటిల్లో 100మీటర్ల పరుగును 9.58సెకన్లలో పూర్తి చేసి బోల్ట్ పేరిట ఉన్న ప్రపంచ రికార్డును కేవలం 9.55సెకన్లలో తిరగరాశాడు. కానీ అది ప్రపంచ వేదికల మీద జరిగే పరుగుల పోటీల్లో కాదు. మంగళూరులోని ఉడుపి ప్రాంతాల్లో ఏటా కంబళ పేరుతో నిర్వహించే సంప్రదాయ ఎద్దుల పందెల్లో్ బురదమట్టిలో వేగంగా పరుగెత్తి రాత్రికి రాత్రే ఇండియన్ బోల్ట్‌గా కీర్తి ఘడించాడు.ఏటా కర్ణాటకలో నిర్వహించే సంప్రదాయ ఎద్దుల పందెల్లో పాల్గొన్న శ్రీనివాస్ గౌడ(28)బురద మట్టిలో తన ఎద్దులతో సమానంగా అతి వేగంగా పరుగెట్టాడు. అతని వేగం చూసి అక్కడికి వచ్చిన వారంతా ఆశ్చర్యానికి లోనయ్యారు. కేవలం 13.62సెకన్లలో 142.50 మీటర్లు పరుగెత్తి పోటీలో విజేతగా నిలిచాడు. వేగం పరంగా చూస్తే 100మీటర్లను అతడు 9.55సెకన్లలోనే చేరకున్నాడు. అంతముందు బోల్ట్ 100మీటర్లను 9.58 సెకన్లలో చేరకుని ప్రపంచ రికార్డును తన పేరున లిఖించాడు. కాగా శ్రీనివాస్‌గౌడ 0.03సెకన్ల తక్కువ సమయంలోనే 100మీటర్లను చేరుకోవడం విశేషం.
రికార్డుల పరంగా బోల్ట్‌కు, శ్రీనివాస్‌కు చాలా వ్యత్యాసం ఉన్నప్పటికి అతడు ఒవర్‌నైట్ స్టార్ అయిపోయాడు. సామాజిక మాద్యమాలు, కన్నడ మీడియాల్లో అతని వేగం గురించి చర్చజరుగుతోంది. ఇదిలాఉండగా కంబళ పరుగు పందెం పోటీల్లో ఉన్న 30ఏళ్ల రికార్డును శ్రీనివాస్ బద్దలుగొట్టాడు. ఇప్పటివరకు అంత వేగంగా పరిగెత్తిన పోటీదారుడిని చూడలేదని అక్కడికి వచ్చిన వారంతా శ్రీనివాస్‌ను పొగడ్తలతో ముంచెత్తారు.

Next Story

Most Viewed