కరీంనగర్‌లో కరోనా మిగిల్చిన విషాదం..

by  |
కరీంనగర్‌లో కరోనా మిగిల్చిన విషాదం..
X

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణ వ్యాప్తంగా కరోనా రక్కసి కరాళ నృత్యం చేస్తోంది. గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు జిల్లాల్లోనూ వైరస్ వ్యాప్తి తీవ్రంగా పెరుగుతోంది. కరోనా బారిన పడిన వారు అటు ఆస్పత్రుల్లో బెడ్లు లేక ఆక్సిజన్ అందుబాటులో లేకపోవడంతో నానా అవస్థలు పడుతున్నారు. తాజాగా కరోనా మహమ్మారి ఒకే ఇంట్లో ఇద్దరిని చిదిమేసింది.

అన్నదమ్ములిద్దరికీ కరోనా పాజిటివ్ రాగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో ఒకే రోజులో అన్నదమ్ములు ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా వీణవంక మండలం అచ్చంపల్లి గ్రామంలో శుక్రవారం వెలుగుచూసింది. విషయం తెలియడంతో బాధిత కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించగా, గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.Next Story

Most Viewed