కొడుకుకు వైద్యుల పేరు పెట్టుకున్న బ్రిటన్ ప్రధాని

by  |
కొడుకుకు వైద్యుల పేరు పెట్టుకున్న బ్రిటన్ ప్రధాని
X

లండన్: చైనాలో పుట్టిన కరోనా వైరస్ యూరోప్ ఖండంలోని పలు దేశాలను చివురుటాకులా వణించించిన విషయం తెలిసిందే. ఇంగ్లాండ్ దేశం కూడా కరోనా దెబ్బకు విలవిల్లాడింది. ఈ క్రమంలో ఏకంగా బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌కు కోవిడ్-19 సోకింది. దీంతో ఆయన ఐసోలేషన్‌లో చికిత్స తీసుకోవాల్సి వచ్చింది. ఒకవైపు ప్రధానిగా బాధ్యతలు.. మరోవైపు తన కాబోయే భార్య నిండు గర్భిణి.. అలాంటి సమయంలో కరోనా బారిన పడటంతో బోరిస్ డిప్రెషన్‌కు గురయ్యారు. ఒకానొక సమయంలో తాను మరణిస్తే ఆ వార్తను బ్రిటన్ ప్రజలకు ఎలా తెలియజేయాలో కూడా ఆసుపత్రిలోని డాక్టర్లు ప్రాక్టీస్ చేసినట్లు బోరిస్ తెలుసుకొని ఉద్వేగానికి గురయ్యారు. కాని ఇంగ్లాండ్ డాక్టర్లు సరైన చికిత్స అందించి బోరిస్ కోలుకునేలా చేశారు. సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా ప్రధాని కార్యాలయంలో తిరిగి అడుగుపెట్టారు. ఆ సంతోషంలో ఉండగానే అతని కాబోయే భార్య కేరీ సైమండ్స్ పండండి మగబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో బోరిస్ ఆనందం ద్విగుణీకృతమైంది. కాగా, తనకు పునర్జన్మ ప్రసాదించిన వైద్యులకు గొప్పగా తన కృతజ్ఞత చాటాడు. తమకు పుట్టిన బిడ్డకు వైద్యుల పేర్లు కలసి వచ్చేలా నామకరణం చేశారు. చిన్నారికి ‘విల్‌ఫ్రెడ్ లారీ నికోలస్ జాన్సన్’ అనే పేరు పెట్టినట్లు బోరిస్ కాబోయే భార్య కేరీ సైమండ్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించారు. ఈ పేరులో విల్‌ఫ్రెడ్ బోరిస్ తాత పేరు కాగా, లారీ సైమండ్స్ తాత పేరు. ఇక బోరిస్‌కు చికిత్స చేసిన డాక్టర్ల పేర్లు నిక్ ప్రైస్, నిక్ హార్ట్.. వీరందరి పేర్లు కలిసి వచ్చేలా ఆ పేరును ఎంచుకున్నట్లు లారీ స్పష్టం చేసింది. జాన్సన్ దంపతులు నిర్ణయాన్ని తెలుసుకున్న వైద్యులు.. తమకు ఇంతకంటే గొప్పగౌరవం ఏముంటుందని ఆనంద వ్యక్తం చేశారు. ఒక దేశ ప్రధాని అయ్యుండి తనకు చికిత్స చేసిన వైద్యుల పేరును కొడుకుకు పెట్టుకోవడం చాలా గొప్ప విషయమని పలువురు కొనియాడుతున్నారు.

Tags : Boris Johnson, Carey Symonds, New Born, Baby Boy, Wilfred Larry Nicholas Johnson, Coronavirus, Britain PM, Covid 19



Next Story