కొవిడ్ నిబంధనలతో బోనాలు

by  |
కొవిడ్ నిబంధనలతో బోనాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: బోనాల వేడుకల్లో తప్పనిసరిగా కొవిడ్ నిబంధనలు పాటించాలని ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు సూచించారు. పోతురాజులు, పూజారులు, రంగం డివోట్స్, ఆలయ సిబ్బంది, వేడుకల్లో పాల్గొనే భక్తులు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. మాస్క్‌లు ధరించడం, శానిటైజర్లు వాడటం, భౌతిక దూరాలను పాటించాలన్నారు. ఈ సీజన్‌లో జరుగుతున్న బక్రీద్ వేడుకల్లో, పెళ్లిళ్లలో, శుభకార్యాలలో ఒకే ప్రదేశంలో ఎక్కవ మంది జనాలు గుమికూడకుండా ఉండాలని సూచించారు.

రాష్ట్రంలో పూర్తిగా కరోనా వైరస్ తొలిగిపోలేదని కొన్ని ప్రదేశాల్లో ఇంకా కేసులు నమోదువుతూనే ఉన్నాయని హెచ్చరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా వైరస్ మళ్లీ విజృంభించే అవకాశాలున్నాయని తెలిపారు. ప్రజల సహకారం వలనే థర్డ్ వేవ్ రాకుండా చేయగలమని వివరించారు. జర్వం, జలుబు, దగ్గు, తలనొప్పి, ఒళ్లు నొప్పులు, గొంతు నొప్పి, వాసన, రుచి కోల్పోవడం వంటి లక్షణాలు ఉంటే వెంటనే కుటుంబసభ్యులకు దూరంగా ఐసోలేషన్ లోకి వెళ్లి ఇతరులకు వ్యాధి సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

Next Story

Most Viewed