ఆ బ్యాంక్ ఖాతాదారులు.. రూ.5 లక్షల రుణం.. 6 నెలలు ఈఎంఐ కట్టక్కర్లేదు

by  |
Money
X

దిశ, వెబ్‌డెస్క్ : చాలా మంది లోన్ కోసం ఎదురు చూస్తుంటారు. ఏ బ్యాంక్ లోన్ ఇస్తుందో అని కళ్లల్లో వొత్తులేసుకుని చూసే వారు చాలా మందే ఉంటారు. ఇక ఈ కరోనా లాంటి కష్ట సమయంలో చాలా మంది ఆర్థికంగా నష్టపోయారు. అలాంటి వారికి బ్యాంక్ తీపి కబురు అందించింది. ఆర్థికంగా సమస్యలు ఎక్కువగా ఉన్నవారి కోసం బ్యాంకులు కొవిడ్ పర్సనల్ లోన్ ఆఫర్ చేస్తుంది. ఈ కొవిడ్ పర్సనల్ లోన్ ను బ్యాంక్ ఆఫ్ ఇండియా అందిస్తోంది. కానీ ఈ కొవిడ్ పర్సనల్ లోన్ తీసుకోవాలంటే కొన్ని నియమ నిబంధనలు, అర్హతలు ఉన్నాయి.

కొవిడ్ పర్సనల్ లోన్ వివరాలు..

  • బ్యాంక్ ఆఫ్ ఇండియాలో శాలరీ అకౌంట్ ఉండాలి.
  • ఇదివరకే బ్యాంక్ నుంచి పర్సనల్ లోన్, హోం లోన్ తీసుకున్నవారికి కొవిడ్ రుణాలు తీసుకోవచ్చు.
  • ఈ రుణం ద్వారా కస్టమర్ రూ.5లక్షల వరకు రుణం పొందవచ్చు.
  • కొవిడ్ రుణాన్ని మూడేళ్లలోపు తిరిగి చెల్లించాలి.
  • బ్యాంక్ ఈ రుణాలపై6.85 శాతం వడ్డీ వసూలు చేస్తుంది.
  • కొవిడ్ లోన్ తీసుకున్న వారికి ఆరు నెలల మారటోరియం ఫెసిలిటీ అందుబాటులో ఉంది.

Next Story

Most Viewed