విశాఖ స్టీల్ ప్లాంట్‌ ప్రైవేటీకరణపై దిగొచ్చిన బీజేపీ

89

దిశ వెబ్‌డెస్క్: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణను వ్యతిరేకిస్తూ ప్రస్తుతం ఏపీలో పెద్ద ఎత్తున ఉద్యమం కొనసాగుతుండగా.. అన్ని రాజకీయ పార్టీలు ఏకమై పోరాటం చేస్తున్నాయి. ఇటీవల జరిగిన బంద్‌కు బీజేపీ, జనసేన మినహా అన్ని రాజకీయ పార్టీలు మద్దతివ్వడంతో బంద్ సక్సెస్ అయింది. ఎప్పుడూ ఉప్పునిప్పులా ఉండే అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీలు విశాఖ స్టీల్ ప్లాంట్‌ ప్రైవేటీకరణ అంశంపై ఏకతాటిపైకి రావడం ఆహ్వానించాల్సిన అంశమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఏపీ ఉన్న పరిస్థితుల్లో రాజకీయాలను పక్కనపెట్టి పార్టీలన్నీ ఒకే గొడుకు కిందకు వచ్చి పోరాడాల్సిన అవసరముందని విశ్లేషకులు చెబుతున్నారు.

అయితే పార్టీలన్నీ కలిసి పోరాడుతుండటంతో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై బీజేపీ దిగొచ్చిందా? అనే చర్చ జరుగుతోంది. తాజాగా ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యాఖ్యల తర్వాత ఆ చర్చ బలపడింది. ప్రైవేటీకరణకు తాము వ్యతిరేకమని, విశాఖ ఉక్కుపై కేంద్రానికి స్పష్టత ఉందని సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. తాము కూడాప్రైవేటీకరణకు వ్యతిరేకమని, తమకు మరో ఉద్ధేశం లేదన్నారు.

ఇప్పటికే ఈ అంశాన్ని ప్రధాని, హోం దృష్టికి తీసుకెళ్లామన్న సోము వీర్రాజు.. రాష్ట్రానికి కేంద్రం ఏం చేయలేదని దుష్ప్రాచారం చేస్తున్నారన్నారు. ప్రణాళికా సంఘం నిధులు 32 నుంచి 42 శాతానికి పెంచారని, స్థానిక సంస్థల నిధులను కేంద్రం ఏనాడూ ఆపలేదన్నారు. ఆరు రకాల అంశాలను కేంద్రం ఎప్పుడూ పర్యవేక్షిస్తుంటుందని సోము వీర్రాజు తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు ఇప్పుడు ఏపీ బీజేపీ కూడా మద్దతివ్వడం చర్చనీయాంశంగా మారింది.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..