ముందు పీవీకి భారతరత్న ఇవ్వండి: కవిత

93

దిశ, ముషీరాబాద్: నిజంగా బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే వెంటనే మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్న ప్రకటించాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం కవాడిగూడలో ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పీవీ సమాధి దగ్గర రాజకీయ డ్రామాలు చేస్తున్నారని విమర్శించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం పీవీ శతజయంతి ఉత్సవాలు నిర్వహిస్తుంటే కాంగ్రెస్ బీజేపీ నాయకులు ఒక్క రోజు కూడా ఆయన కోసం మాట్లాడలేదన్నారు. జీహెచ్ఎంసి ఎన్నికలు రాగానే ఒక పార్టీ పీవీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తూ ఉంటే, మరో పార్టీ దాన్ని అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. పీవీకి భారతరత్న ప్రకటించకుండా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని ఎవరు అడ్డుకున్నారని కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు.