అంతటి గొప్ప వ్యక్తిని ఈవిధంగా అవమానిస్తారా..? : రమాదేవి

by Aamani |   ( Updated:2021-10-25 02:32:31.0  )
BJP-Mahila1
X

దిశ, ముధోల్: నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో ఆదివారం మధ్యాహ్నం అంబేద్కర్ విగ్రహం ధ్వంసం చేసిన నిందితులను వెంటనే శిక్షించాలని నిర్మల్ జిల్లా బీజేపీ అధ్యక్షురాలు రమాదేవి డిమాండ్ చేశారు. సోమవారం హుజురాబాద్ నియోజకవర్గంలోని చెల్పూర్ లో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద కళ్లకు నల్ల గంతలు కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… రాజ్యాంగాన్ని రచించిన మహానుభావుడు అంబేద్కర్.. ఆయనకు ఈ విధంగా అవమానం జరగడం బాధాకరం అని, ఈ ఘటనకు పూనుకున్న వారిని వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు. ఆమె వెంట భైంసా పట్టణ బీజేపీ కార్యకర్తలు తదితరులు ఉన్నారు.

Advertisement

Next Story