హుజురాబాద్‌లో బీజేపీ సత్తా ఏంటో చూపిస్తాం: మురళీధర్ రావు

by  |
హుజురాబాద్‌లో బీజేపీ సత్తా ఏంటో చూపిస్తాం: మురళీధర్ రావు
X

దిశ, కరీంనగర్ సిటీ : హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఓటమి భయంతోనే రాష్ట్ర ప్రభుత్వం అక్కడ అభివృద్ధి పేరిట నిధుల వరద పారిస్తుందని, బీజేపీ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మధ్యప్రదేశ్ రాష్ట్ర ఇన్‌చార్జీ పొల్సాని మురళీధర్ రావు ఆరోపించారు. సోమవారం నగరంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం పై దుమ్మెత్తి పోశారు. కేంద్రం చేపడుతున్న సంక్షేమ పథకాలను తన ఖాతాలో వేసుకుంటూ టీఆర్ఎస్ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. తెలంగాణలో ప్రభుత్వం పనిచేయడం లేదని, ఒక్క హుజురాబాద్‌కే పరిమితమైందని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సైతం రాష్ట్ర అభివృద్ధిని వీడి ఒక్క హుజురాబాద్ అభివృద్ధిపైనే సమీక్షలు నిర్వహించడం శోచనీయమన్నారు. గెలుపే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం నిధుల వరద పారిస్తుందని, ఈ డబ్బులు ఎవ్వరి సొత్తు కాదని, హుజురాబాద్ ప్రజలవేనని, వారి డబ్బులతో వారినే మభ్యపెట్టేందుకు యత్నించటం సిగ్గు చేటన్నారు. ఇంత చేస్తున్నా అక్కడ టీఆర్ఎస్ డిపాజిట్ కూడా దక్కించుకునే స్థితిలో లేదన్నారు. హుజురాబాద్‌లో టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయo మేమే అని నిరూపించి తీరుతామని స్పష్టం చేశారు. సెప్టెంబర్ 17న హైదరాబాద్ విమోచన దినం జరపాల్సిందేనని, ఆ రోజున ప్రతి ఇంటి మీద జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు.

Next Story

Most Viewed