బీజేపీ నేత డీకే అరుణ అరెస్ట్ !

186

దిశ, వెబ్‌డెస్క్: వనపర్తి జిల్లాలో బీజేపీ నేత డీకే అరుణను పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం కల్వకుర్తి లిప్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌ పరిశీలించేందుకు వెళ్తుండగా పెబ్బేరు సమీపంలో ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా డీకే అరుణ మాట్లాడుతూ కేసీఆర్ పర్సంటేజీల కోసమే కేఎల్ఐ నాసిరకం పనులు చేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే అక్కడ జరిగిన అవినీతిని వెంటనే బయట పెట్టాలని డిమాండ్ చేశారు. మేం వెళ్తే కేసీఆర్ అవినీతి బయట పడుతుందనే భయంతోనే అడ్డుకుంటున్నారని ఆరోపించారు. డీకే అరుణ అరెస్ట్‌తో అక్కడ పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో పలువురు బీజేపీ నేతలను కూడా అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు.