వామన్‌రావు నిందితుడిని ఎన్‌కౌంటర్ చేస్తారేమో :బండి సంజయ్

by  |
వామన్‌రావు నిందితుడిని ఎన్‌కౌంటర్ చేస్తారేమో :బండి సంజయ్
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: హైకోర్టు న్యాయవాద దంపతుల హత్య కేసుపై సీఎం కేసీఆర్ స్పందించనట్టయితే ఆయన ప్రోద్భలం ఉన్నట్టుగానే భావించాల్సి వస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. గురువారం పెద్దపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం బర్త్ డే వేడుకల్లో పాల్గొన్న టీఆర్ఎస్ నాయకుడు అడ్వకేట్ కపుల్స్‌ను హత్య చేశాడని ఆరోపించారు. ఈ కేసును పూర్తి స్థాయిలో విచారణ జరిపి.. నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ హత్య చేసింది ఒక వ్యక్తి కాదని.. దీని వెనక చాలామంది పెద్దల హస్తం ఉందని ఆరోపించారు.

న్యాయవాదులకు రక్షణ ఉందన్న భరోసా కల్పించాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని బండి సంజయ్ పేర్కొన్నారు. వామన్‌రావు మర్డర్ కేసును సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి.. ఆయన రాష్ట్ర ప్రభుత్వంపై పెట్టిన కేసులన్నింటి కోసం ప్రత్యేకంగా బెంచ్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ హత్యల కేసును నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నారని, ఆ కారణంగానే కుంట శ్రీనివాస్ అనే వ్యక్తి నిందితుడు అని అధికారులు చెబుతున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వంపై వచ్చిన ఆరోపణల నుండి తప్పించుకునేందుకు నిందితుడిని ఎన్‌కౌంటర్ చేసే అవకాశం కూడా లేకపోలేదని బండి సంజయ్ అన్నారు. దీంతో నిందితునికి తగిన శాస్తి జరిగిందన్న సంకేతాలను ప్రజల్లోకి పంపించి లాభం పొందే అవకాశం ఉంటుందన్నారు.



Next Story

Most Viewed