అధిక ఫీజులు వసూలు చేస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి

by  |
ragam arjun
X

దిశ, మేడ్చల్: మండలం పరిధిలోని కార్పొరేట్ స్కూళ్లు, కాలేజీల్లో ముందస్తు ఫీజులు దోపిడీని అరికట్టాలని మేడ్చల్ మల్కాజ్గిరి బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు రాగం అర్జున్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పాఠశాల, కళాశాలలోని యాజమాన్యాలు తల్లిదండ్రుల నుంచి బలవంతంగా ఫీజులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. కరోనా థర్డ్ వేవ్ పేరిట మళ్ళీ విద్యాసంస్థలు మూతపడతాయని భావించి ఫీజులు కట్టాలంటూ విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్లు చేసి ఇబ్బంది పెడుతున్నారని తెలిపారు. ఇప్పటికే స్కూల్ పుస్తకాలు, యూనిఫాం బట్టలకు వేలకు వేలు ఖర్చు పెట్టామని పేరెంట్స్ వాపోతున్నారని అన్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖ అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరారు.

Next Story

Most Viewed