జీహెచ్ఎంసీ‌లో వాటి పేరుతో ఏడాదికి 20 కోట్ల స్కాం జరుగుతుంది.. బీజేపీ

by  |
bjp
X

దిశ, అంబర్ పేట్: ప్రజా సమస్యలపై ప్రశ్నించే తమ గొంతును అధికార పార్టీ నొక్కే ప్రయత్నం చేస్తుందని బీజేపీ హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు గౌతమ్ రావు ఆరోపించారు. జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశంలో బీజేపీ కార్పొరేటర్‌లు లేవనెత్తిన ప్రశ్నలను చర్చించకుండానే సమావేశాన్ని ముగించారని విమర్శించారు. హైదరాబాద్ బర్కత్ పురాలోని సిటీ బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో గౌతమ్ రావు మాట్లాడారు. ప్రజల సమస్యలపై ప్రశ్నించే తమ గొంతును అధికార పార్టీ నొక్కే ప్రయత్నం చేసిందని అన్నారు. తాము గెలిచి ఏడాది గడుస్తున్నా డివిజన్‌ల అభివృద్ధికి నిధులు కేటాయించకుండా నిర్లక్ష్యం వహిస్తుందన్నారు. స్విపింగ్ మిషన్ల పేరుతో ఏడాదికి 20 కోట్ల స్కాం జీహెచ్ఎంసీ‌లో జరుగుతున్న అధికార యంత్రాంగం చోద్యం చూస్తుందని ఆరోపించారు.

జీహెచ్ఎంసీలో కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంతో అభివృద్ధి పనులు నిలిచిపోయాయని అన్నారు. క్రిస్మస్ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న క్రిస్మస్ గిఫ్ట్ ల పంపిణీ కార్యక్రమంలో బీజేపీ కార్పొరేటర్‌లకు సమాచారం ఇవ్వకుండా అధికార పార్టీ ఎమ్మెల్యేలే పంపిణీ చేస్తున్నారని విమర్శించారు. మరోసారి కౌన్సిల్ సమావేశం నిర్వహించి సమస్యలను ప్రశ్నించేందుకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. వాజ్‌పేయి జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరాలు, మెడికల్ క్యాంప్ లను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆజాదికా అమృతోత్సవం కార్యక్రమంలో భాగంగా రాంగోలి , కైట్ ఫెస్టివల్స్ నిర్వహిస్తున్నట్లు గౌతమ్ రావు పేర్కొన్నారు.



Next Story

Most Viewed