మాస్క్ సురక్షితమేనా? ఇలా తెలుసుకోండి!

by  |
మాస్క్ సురక్షితమేనా? ఇలా తెలుసుకోండి!
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో మాస్క్ వాడకం తప్పనిసరి. కానీ చాలా మంది ఏదో నామమాత్రంగా మాస్క్ ధరిస్తున్నారు. మరొకొందరైతే ఏదో చిన్న బట్టముక్కను మూతికి కట్టుకుని, ముక్కును గాలికొదిలేస్తున్నారు. ఒక్కసారి బయటకెళ్లినప్పుడు పరిశీలనగా చూస్తే.. 100 మందిలో యాభైకి పైగా వెరైటీ మాస్కులే కనిపిస్తాయి. అవన్నీ సురక్షితమైనావేనా? అంటే ఎవరి దగ్గరి నుంచి సమాధానం రాదు. కరోనా అంటే ఓ పక్క విపరీతంగా భయపడుతూనే.. మరోపక్క ప్రాణాల్ని కాపాడే మాస్క్ విషయంలో మాత్రం నిర్లక్ష్యం చూపిస్తాం. ఈ క్రమంలో అసలు మన మాస్క్ ఎంత వరకు ప్రొటెక్టివ్‌గా ఉందో తెలుసుకోవాలంటే.. అమెరికన్ సైన్స్ కమ్యూనికేటర్, టెలివిజన్ ప్రజెంటర్ బిల్ నై మాస్క్ మీద చేసిన ఈ సైన్స్ ఎక్స్‌పరిమెంట్ గురించి తెలుసుకోవాల్సిందే.

వైరస్ నుంచి మాస్క్‌లు ఎలా కాపాడాతాయో.. శ్వాసలో కలిసిపోయే వైరస్‌లను మాస్క్ ఏ విధంగా అడ్డుకుంటుందనేది ఈ సులభమైన ప్రయోగం ద్వారా తెలుసుకోవచ్చు. ముందుగా ఒక కొవ్వొత్తిని వెలిగించాలి. తర్వాత మాస్క్ పెట్టుకుని ఆ కొవ్వొత్తిని ఆర్పేందుకు గాలి ఊదాలి. కొవ్వొత్తి వెంటనే ఆరిపోయినా లేదా మంట అటు అటూ కదిలినా మాస్క్ నాణ్యత లేనిదని అర్థం. కొవ్వొత్తి మంటపై బలంగా గాలి ఊదినప్పుడు ఎటువంటి ప్రభావం చూపకపోయినా, అటూ ఇటు అగ్ని కదలకపోయినా అది బాగా పనిచేస్తుందని అర్థం. కాగా, మెడికల్ షాపుల్లో దొరికే సర్జికల్ మాస్క్‌లు ఈ విషయంలో ఫెయిల్ కాగా.. ఎన్95 సూపర్ సక్సెస్ అయ్యింది.

Next Story

Most Viewed