నాగార్జునను అరెస్టు చేయాలి.. తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు

by Disha Web Desk 9 |
నాగార్జునను అరెస్టు చేయాలి.. తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు
X

దిశ, వెబ్‌డెస్క్: నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించిన బిగ్‌బాస్‌ సీజన్ -7 గ్రాండ్‌ ఫినాలే ఆదివారం జరిగింది. కామన్ మ్యాన్‌గా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన రైతుబిడ్డకు పల్లవి ప్రశాంత్ బిగ్‌బాస్‌ టైటిల్‌ గెలుచుకుని విజేతగా నిలిచాడు. కాగా షో పూర్తి కాగానే ప్రశాంత్, అమర్‌దీప్ బయటికి వచ్చారు. బయటకు రాగానే అభిమానులు ఎగబడ్డారు. ఈ క్రమంలో ప్రశాంత్, అమర్‌దీప్‌, ఇతర ఇంటి సభ్యుల ఫ్యాన్స్ మధ్య గొడవలు జరిగాయి. రైతుబిడ్డ అభిమానులు అమర్‌దీప్‌, అశ్వినీ కారు అద్దాలను బద్దలు కొట్టడమే కాకుండా.. ఒక ఆర్టీసీ బస్సును ధ్వంసం చేశారు. దీనిపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ స్పందించిన విషయం తెలిసిందే. అభిమానం పేరుతో చేసే పిచ్చి చేష్టలు సమాజానికి మంచిది కాదు. ఆర్టీసీపై దాడి అంటే సమాజంపై దాడి చేసినట్లేనని హెచ్చరించారు.

ఇకపోతే తాజాగా బిగ్‌బాస్‌ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న నాగార్జున షో నిర్వాహకులను అరెస్ట్‌ చేయాలని అడ్వకేట్‌ అరుణ్‌ కుమార్‌ తెలంణాణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. బిగ్‌బాస్‌ పేరుతో అక్రమంగా 100 రోజుల పాటు కంటెస్టెంట్లను నిర్భందించడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేస్తూ పిటీషన్ వేశారు. బిగ్‌బాస్‌ పోటీలో ఉన్న వారిని విచారించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇదే విషయం పై మహిళ కమిషన్‌ ఛైర్మన్‌కు కూడా ఫిర్యాదు చేస్తామని పిటీషనర్‌ అరుణ్‌ కుమార్‌ వెల్లడించారు. అలాగే ప్రభుత్వ ఆస్తులను నాశనం చేయడం వెనకున్న కుట్రను బయటకు తీయాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Read More : Pallavi Prashanth : పరారీలో బిగ్‌బాస్-7 విన్నర్ . ఎక్కడున్నాడో తెలుసా?



Next Story

Most Viewed