Bigg Boss 7 Telugu : అమ్మాయిల్ని ఫ్లర్ట్ చేయడానికి వచ్చావా అంటూ.. పల్లవి ప్రశాంత్ పరువు తీసిన శోభా శెట్టి..?

by Prasanna |   ( Updated:2023-09-13 05:14:06.0  )
Bigg Boss 7 Telugu : అమ్మాయిల్ని ఫ్లర్ట్ చేయడానికి వచ్చావా అంటూ.. పల్లవి ప్రశాంత్ పరువు తీసిన శోభా శెట్టి..?
X

దిశ,వెబ్ డెస్క్: సోమవారం నామినేషన్స్ ఎపిసోడ్ మంగళవారం వరకు కొనసాగింది. రైతు బిడ్డ ఒక్కడిని చేసి అమర్ దీప్ అండ్ కో సీరియల్ బ్యాచ్ బాగా ఆడేసుకున్నారు. 10 వ ఎపిసోడ్ లో మన మోనిత అయితే.. తెగ రెచ్చిపోయింది. నువ్వు ఇక్కడికి దేని కోసం వచ్చావ్.. కానీ నువ్వు చేస్తున్న పని ఏంటి అని ఇష్టమొచ్చినట్లు మాటలు అనేసింది. ప్రశాంత్ ఏమి మాట్లాడకుండా అలాగే ఉన్నాడు. శోభా శెట్టి మళ్లీ మొదలు పెట్టి అయిన నీలో రెండు యాంగిల్స్ కనిపిస్తున్నాయి. రతిక వెనుక ఎందుకు పడుతున్నావ్? టైటిల్ కోసమే వచ్చావా? అమ్మాయిల్ని ఫ్లర్ట్ చేయడానికి వచ్చావా? అంటూ రైతు బిడ్డ పరువు మొత్తం తీసేసింది. ఈ మాటకి ప్రశాంత్.. ‘రతిక నేను నిన్ను లవ్ చేస్తున్నానని ఎప్పుడైనా చెప్పానా? అని అడిగాడు ప్రశాంత్. అప్పుడు రతిక పాప రియాక్ట్ అయ్యి.. ‘ హౌస్లో ఉన్న వాళ్లు అంత పిచ్చోళ్లు కాదు.. అందరికీ తెలుసు’ అని అన్నది. అసలు ఈమెకు మాట్లాడటం వచ్చా? రాదా? ఒక టాపిక్ గురించి మాట్లాడి మళ్లీ సంబంధం లేకుండా వేరే దాని మాట్లాడుతుందని నెటిజెన్స్ మండిపడుతున్నారు.

More News : Bigg Boss 7 Telugu : 'కుక్కలా తిరిగిన నీకు అవకాశం ఇస్తే.. ఇక్కడకొచ్చి ఏమి చేస్తున్నావ్' అంటూ పల్లవి ప్రశాంత్ పై ఫైర్ అయిన రతిక

Advertisement

Next Story

Most Viewed