కాటారంలో పెద్దపులి సంచారం.. భయంతో వణికిపోతున్న జనాలు

by  |
Wandering tiger
X

దిశ, కాటారం: పెద్దపులి సంచారంతో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు భయంతో వణికిపోతున్నారు. మంగళవారం ఉదయం మండలంలోని ఒడిపిలపంచ గ్రామ శివారులో గేదెల గుంపుపై పెద్దపులి దాడి చేసింది. ఈ దాడిలో గుమ్మలపల్లి గ్రామంలోని ఓదేలు అనే వ్యక్తికి చెందిన రెండు గేదెలు మృత్యువాతపడ్డారు. అయితే, నిన్నటినుంచి పెద్దపులి సంచరిస్తుండటం మూలంగా గేదెలు, కోడిపిల్లలు చనిపోతుండటంతో అటవీశాఖ అధికారులు అప్రమత్తమై ఫారెస్ట్‌లో మూడు సీసీ కెమెరాలు అమర్చి పెద్దపులి కదలికలపై నిఘా పెట్టి, ఆ ప్రాంతంలోనే రాత్రి బస చేశారు. తాజాగా.. మంగళవారం రెండు గేదెలపై పెద్ద పులి దాడి చేయడంతో గేదెల కాపరి ఓదేలు దాని బారినుంచి తప్పించుకొని అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. కాగా, పెద్దపులి సంచారంతో కాటారం మండల జనాలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. కొందరైతే వ్యవసాయ పనులకు వెళ్లడం మానేశారు.

Next Story

Most Viewed