కొవాగ్జిన్ ఉత్పత్తి సామర్థ్యాన్ని ఏడాదికి 70 కోట్లకు పెంచుతాం : భారత్ బయోటెక్!

by  |
కొవాగ్జిన్ ఉత్పత్తి సామర్థ్యాన్ని ఏడాదికి 70 కోట్లకు పెంచుతాం : భారత్ బయోటెక్!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా కొవిడ్ కేసులు భారీ సంఖ్యలో పెరుగుతున్న నేపథ్యంలో కరోనా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తున్న భారత్ బయోటెక్ కొవాగ్జిన్ వ్యాక్సిన్ తయారీ సామర్థ్యాన్ని పెంచనున్నట్టు మంగళవారం ప్రకటించింది. హైదరాబాద్, బెంగళూరులలో ఏడాదికి 70 కోట్ల మోతాదుల ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచనున్నట్టు సంస్థ తెలిపింది. సోమవారం కేంద్రం రూ. 1,500 కోట్ల రుణాలను భారత్ బయోటెక్‌కు అందజేయనున్నట్టు ప్రకటించడంతో వ్యాక్సిన్ తయరీ ఉత్పత్తిని భారీగా పెంచాలని లక్ష్యంగా ఉన్నామని కంపెనీ తెలిపింది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని భారత్ బయోటెక్ నెలకు 40 లక్షల మోతాదుల కొవాగ్జిన్ వ్యాక్సిన్‌లను ఉత్పత్తి చేస్తుండగా, పూణెకు చెందిన సీరం ఇన్‌స్టిట్యూట్ 6 కోట్ల మోతాదుల కొవిషీల్డ్‌ను ఉత్పత్తి చేస్తోంది.

వ్యాక్సిన్ తయారీ ప్రక్రియ సుధీర్ఘమైన, శ్రమతో కూడుకున్నది. దీనికి అధిక పెట్టుబడి, ఏళ్ల కాలం అవసరం. భారత్ బయోటెక్ తక్కువ కాలంలో కొవాగ్జిన్ తయారీ సామర్థ్యాన్ని విస్తరిస్తుంది. కొత్తగా రూపొందించిన బీఎస్ఎల్ 3 కారణంగా తక్కువ సమయంలోనే వ్యాక్సిన్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచనున్నట్టు కంపెనీ వివరించింది. కొవాగ్జిన్ తయారీ కోసం ఇండియన్ ఇమ్యునోలాజికల్స్‌తో భాగస్వామ్యం చేసుకున్నామని, టెక్నాలజీ బదిలీ ప్రక్రియ జరుగుతోందని కంపెనీ తెలిపింది. కొవాగ్జిన్ ఉత్పత్తి జూన్ నాటికి రెట్టింపునకు చేరుకుంటుందని, ఆగస్టు నాటికి 7 రెట్ల వరకు పెరుగుతుందని సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ తెలిపింది.



Next Story

Most Viewed