గృహ రుణాలపై అతి తక్కువ వడ్డీ రేట్లను ప్రకటించిన బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర!

by  |
bank of maharasta
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర(బీఓఎం) గృహ రుణాలపై వడ్డీ రేట్లను ఆల్‌టైమ్ కనిష్ఠం 6.40 శాతానికి తగ్గిస్తున్నట్టు ఆదివారం ప్రకటించింది. ప్రస్తుతం బ్యాంకు ‘రిటైల్ బొనాంజా-ఫెస్టివ్ ధమాకా’ ఆఫర్ కింద 6.80 శాతానికి గృహ రుణాలను అందిస్తోంది. దీంతో పాటు మార్కెట్లో పోటీకి అనుగుణంగా కారు రుణాలపై వడ్డీ రేటును 7.05 శాతం నుంచి 6.80 శాతానికి తగ్గించింది. సవరించిన ధరలు సోమవారం(డిసెంబర్ 13) నుంచి అమల్లోకి వస్తాయని బ్యాంకు ఓ ప్రకటనలో పేర్కొంది.

ప్రస్తుతం ఉన్న ఫెస్టివ్ ధమాకా ఆఫర్‌ను రుణం తీసుకునే ఖాతాదారుల క్రెడిట్ స్కోర్ ఆధారంగా ఇస్తున్నామని, అలాగే వినియోగదారులకు బంగారం, గృహ, కార్ల రుణాలపై ప్రాసెసింగ్ ఫీజును మాఫీ చేసినట్టు బ్యాంకు వివరించింది. ఈ ఆఫర్ ద్వారా తమ కస్టమర్లు రుణాలపై మరింత ఆదా చేసుకునేందుకు వీలవుతుందని, అందుకు బ్యాంకు తోడ్పాటు అందిస్తోందని బీఓఎం మేనేజింగ్ డైరెక్టర్ ఏ ఎస్ రాజీవ్ చెప్పారు. తాజా ఆఫర్‌తో రిటైల్ రుణాల్లో బ్యాంకింగ్ పరిశ్రమలోనే గృహ, కారు రుణాలపై అతి తక్కువ వడ్డీ రేట్లను అందజేస్తున్నట్టు బీఓఎం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హేమంత్ వెల్లడించారు.


Next Story

Most Viewed