టీఆర్ఎస్ ఖేల్ ఖతమేనా.. అమిత్ షాతో బండి, ఈటల సమావేశం

by  |
టీఆర్ఎస్ ఖేల్ ఖతమేనా.. అమిత్ షాతో బండి, ఈటల సమావేశం
X

దిశ, వెబ్‌డెస్క్ : హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, మాజీ మంత్రి ఈటల భేటీ కానున్నారు. బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు ఈ సమావేశం జరగనుంది. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. ఈటలతో కలిసి సమావేశమయ్యేందుకే అపాయింట్ మెంట్ కోరినట్లు వివరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులను అమిత్ షాకు వివరిస్తామని బండి చెప్పారు. హుజురాబాద్ ఉపఎన్నిక విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోనున్నారో కూడా వెల్లడించనున్నట్లు తెలిపారు.

అయితే, ఈ భేటీ వెనుక సీక్రెట్ అజెండా ఉండనున్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గంలో టీఆర్ఎస్ లాబీయింగ్, ఆపరేషన్ ఆకర్ష్‌తో పాటు పోలీసులను ఎన్నికల కోసం టీఆర్ఎస్ పార్టీ ఎలా వాడుకుంటుందో వివరించే అవకాశం ఉందని.. ఈ నేపథ్యంలోనే గులాబీ పార్టీకి సరిగ్గా ఉపఎన్నిక ముందు చెక్ పెట్టేలా ఢిల్లీ నుంచి ఏదైనా కొత్త వ్యుహంతో బండి సంజయ్ రానున్నరా అనేది ప్రస్తుతం కమలదళంతో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది.

Next Story

Most Viewed