తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా బక్కని నర్సింహులు

by  |
తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా బక్కని నర్సింహులు
X

దిశ ప్రతినిధి, రంగారెడ్డి: తెలంగాణ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింహులను నియమిస్తూ ఆపార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఈ రోజు ప్రకటన విడుదల చేశారు. మొన్నటి వరకు టీడీపీ అధ్యక్షుడిగా పనిచేసిన ఎల్.రమణ రాజీనామా చేసి టీఆర్ఎస్‌లో చేరారు. దాంతో ఖాళీ అయిన రాష్ట్ర అధ్యక్ష పదవికి దళిత సామాజికవర్గానికి చెందిన బక్కని నరసింహులను నియామిస్తూ నిర్ణయం తీసుకున్నారు. నరసింహులు 1994‌‌–99 వరకు షాద్ నగర్ ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం కూడా ఉంది.

ఈ అధ్యక్ష పదవికి ముగ్గురు నేతలు పోటీ పడినప్పటికి నిర్ణయం మాత్రము చంద్రబాబుకే వదిలేశారు. పార్టీకి నిబద్దతగా పనిచేసే నేతతో పాటు నాయకులను, కార్యకర్తలను కలుపుకొని పోయే నాయకుడు బక్కని నర్సింహులని బాబు గుర్తించినట్లు తెలుస్తోంది. రంగారెడ్డి జిల్లా ఫారూఖ్ నగర్ మండలం లింగారెడ్డి గూడేం గ్రామానికి చెందిన వ్యక్తి బక్కని నర్సింహులు. ఈయన విద్యార్ధి దశ నుంచే రాజకీయాలపై ఆసక్తి ఉండేది. అయితే సామజిక అంశాలపై పనిచేస్తూన్న నరిసింహులుకు ఎస్సీ రిజర్వుడైనా షాద్‌నగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం వచ్చింది. ఆ సమయంలో టీడీపీ బక్కనికి భీఫాం ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు. ఆనాటి నుంచి నేటి వరకు టీడీపీ నేతగానే కొనసాగుతున్నారు. తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంపికైన బక్కని నర్సింహులు చంద్రబాబును, నారా లోకేష్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం బాబు, లోకేష్ మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రజా సమస్యలపై పోరాటం చేసి, పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు.

T TDP తర్వాతి అధ్యక్షుడిగా ‘బక్కని’కి చాన్స్..?

Next Story

Most Viewed