ఎలక్ట్రిక్ చేతక్ స్కూటర్లను డెలివరీ ఇవ్వనున్న బజాజ్.. ఎప్పుడంటే..?

by  |
Electric Vehicles
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో తన ఎలక్ట్రిక్ చేతక్ స్కూటర్‌ను సెప్టెంబర్‌లో కస్టమర్లకు డెలివరీ చేయనున్నట్టు తెలుస్తోంది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వార్షిక నివేదికలో కంపెనీ ఈ మేరకు వివరాలను వెల్లడించింది. 2020లోనే ఈ స్కూటర్ కోసం బుకింగ్‌లను కంపెనీ ప్రారంభించింది. అయితే, కొవిడ్ మహమ్మారి కారణంగా నిలిపేసింది. అనంతరం ఈ ఏడాది ఏప్రిల్‌లో తిరిగి బుకింగ్‌లు మొదలుపెట్టగా భారీగా స్పందన వచ్చింది. ఆ తర్వాత 48 గంటల్లోనే బుకింగ్‌లను ఆపేసింది. ఈ క్రమంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో వీటి డెలివరీ చేపట్టనున్నట్టు తెలిపింది.

కొనుగోలుదారుల ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచాలని భావిస్తున్నట్టు కంపెనీ వివరించింది. వీలైనంత త్వరగా ఉత్పత్తి, సరఫరా అంశాలను పరిశీలించి బుకింగ్‌లను ప్రారంభించనున్నట్టు ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. కాగా, బజజ్ ఎలక్ట్రిక్ స్కూటర్ చేతక్ ప్రీమియం, చేతక్ అర్బన్ అనే రెండు వేరియంట్లలో లభిస్తోంది. వీటి ధరలు రూ. 1.22 లక్షల నుంచి రూ. 1.26 లక్షల వరకు నిర్ణయించారు. ఈ స్కూటర్‌లో ఐపీ6 హైటెక్ లిథియం అయాన్ బ్యాటరీ అమర్చారు. పూర్తి ఛార్జింగ్ చేసిన తర్వాత ఎకో మోడ్‌లో 95 కిలోమీటర్లు ప్రయాణించవచ్చని కంపెనీ తెలిపింది.



Next Story

Most Viewed