భైంసాలో ఆంక్షల సడలింపు..

by  |
భైంసాలో ఆంక్షల సడలింపు..
X

దిశ, వెబ్‌డెస్క్ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని భైంసాలో ఉద్రిక్త పరిస్థితుల నెలకొన్నాయి. దీంతో అక్కడ పోలీసులు కఠిన ఆంక్షలు విధించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు నిత్యం పోలీసులు పహారా కాస్తున్నారు. రెండు వర్గాల మధ్య తలెత్తిన వివాదం వలన భైంసాలో అల్లర్లు చెలరేగిన విషయం తెలిసిందే. అర్ధరాత్రి దాటాక కొందరు మూకలు ఇళ్ల ముందు నిలిపిన వాహనాలను దగ్దం చేశారు. అంతేకాకుండా, ఓ కమ్యూనిటీకి చెందిన కొందరు మరో కమ్యూనిటీకి చెందని బాలికపై అత్యాచారం చేసినట్లు తేలింది.

దీంతో అక్కడ ఇంటర్నెట్ సేవలు కూడా అధికారులు నిలిపివేశారు. తాజాగా అక్కడి పరిస్థితులను చక్కదిద్దేందుకు పోలీసులు చొరవ చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆంక్షలను సడలించారు. రేపటి నుంచి నిత్యావసర సరుకుల షాపులు తెరిచేందుకు అనుమతిచ్చారు.ఉదయం7 గంటల నుంచి 11 వరకు అనుమతులు ఇవ్వనున్నారు. కాగా, 144 సెక్షన్ మాత్రం యధాతథంగా కొనసాగనున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు.

Next Story

Most Viewed