బాబ్రీ మసీదు కూల్చివేత కేసు..జోషీ వాంగ్మూలం

by  |
బాబ్రీ మసీదు కూల్చివేత కేసు..జోషీ వాంగ్మూలం
X

లక్నో: బాబ్రీ మసీదు కూల్చివేతకు సంబంధించిన కేసులో బీజేపీ కురువృద్ధుడు మురళీ మనోహర్‌ జోషి వాంగ్మూలాన్ని కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) ప్రత్యేక కోర్టు గురువారం నమోదు చేసింది. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రత్యేక న్యాయమూర్తి ఎస్‌కే యాదవ్‌, జోషి వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. ఇదే కేసులో మాజీ ఉప ప్రధానమంత్రి ఎల్‌కే అద్వానీ వాంగ్మూలం కూడా శుక్రవారం నమోదు చేయనున్నారు. ప్రస్తుతం ఈ కేసు సీఆర్‌పీసీ సెక్షన్‌ 313 కింద 32మంది నిందితుల వాంగ్మూలాన్ని నమోదుచేసే దశలో ఉంది. ఈ సమయంలో వీరికి వ్యతిరేకంగా ఉన్న ప్రాసిక్యూషన్ సాక్ష్యాలను తిరస్కరించే అవకాశం లభిస్తుంది. కాగా, ఈ కేసును వచ్చే నెల 31లోగా పూర్తి చేయాలని లక్నో సీబీఐ కోర్టుకు సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే.

Next Story

Most Viewed