500 మైళ్లకు చేరిన అయ్యప్ప స్వాముల పాదయాత్ర

75

దిశ, సంగారెడ్డి: లోక కళ్యాణార్థం సంగారెడ్డి నుంచి శబరిమలకు కొక్కొండ శ్రీశైలం, సాహితీ రాము గురుస్వాముల ఆధ్వర్యంలో 22 మంది స్వాములు ప్రారంభించిన మహా పాదయాత్ర గురువారం 500 కిలోమీటర్లు చేరుకుంది. సంగారెడ్డి పట్టణంలోని నవరత్నాలయం నుంచి ఈ నెల 6వ తేదీన ప్రారంభమైన ఈ పాదయాత్ర తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్టాల మీదుగా 20 రోజుల తర్వాత కర్ణాటకకు చేరింది. అయ్యప్ప స్వామి శరణు ఘోష, భజనలు చేసుకుంటూ గురుస్వాములు, స్వాములు పాదయాత్రలో ముందుకు సాగారు. డిసెంబర్ 15వ తేదీన శబరిమల చేరుకుంటామని గురుస్వాములు తెలిపారు. ఈ పాదయాత్ర కార్యక్రమంలో ఎం.సత్యనారాయణ, విశ్వనాథ్ రావు, దామోదర్, గుండ్లపల్లి నరేష్, మానిక్ రెడ్డి, వెంకన్న, పరమేశ్వర్ గౌడ్, ప్రభు గౌడ్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..